Mele padi ninnidaa meppimchidivi

మేలే పతి నిన్నిటా మెప్పించితివి
Language

(॥పల్లవి॥)
మేలే పతి నిన్నిటా మెప్పించితివి
నీ లాగు లెల్లఁ గంటి నేరుపరి వౌదువే

(॥॥)
వద్ద నుండి దాని మీఁద వలపులు గడుమించు
అద్దుకొన్న మగవాని కలరుచును
వొద్దికై యంతటిమీఁద నూడిగాలు సేసితేను
పొద్దువొద్దుకుఁ జవులు పట్టి తమి రేఁగును

(॥॥)
యిచ్చలాడే దానిపై నే యింపు లెల్లఁ బెనగొను
విచ్చన విడి నుండేటి విభునికిని
పచ్చిగా నంతటిమీఁద బత్తి గడుఁ జూపితేను
నిచ్చకల్యాణములై నిండుకొను రతులు

(॥॥)
వినయపు దానిఁ గంటే వేడుకలు దైవారు
ననుపు జుట్టరికపు నాయకునికి
మును శ్రీ వేంకటేశుఁడు నిను నలమేల్మంగను
యెనసిఁ గొసరితేను యిచ్చు సిరు లిప్పుడే.

(||pallavi||)
mele padi ninniḍā mĕppiṁchidivi
nī lāgu lĕllam̐ gaṁṭi nerubari vauduve

(||||)
vadda nuṁḍi dāni mīm̐da valabulu gaḍumiṁchu
addugŏnna magavāni kalarusunu
vŏddigai yaṁtaḍimīm̐da nūḍigālu sesidenu
pŏdduvŏddugum̐ javulu paṭṭi tami rem̐gunu

(||||)
yichchalāḍe dānibai ne yiṁpu lĕllam̐ bĕnagŏnu
vichchana viḍi nuṁḍeḍi vibhunigini
pachchigā naṁtaḍimīm̐da batti gaḍum̐ jūbidenu
nichchagalyāṇamulai niṁḍugŏnu radulu

(||||)
vinayabu dānim̐ gaṁṭe veḍugalu daivāru
nanubu juṭṭarigabu nāyagunigi
munu śhrī veṁkaḍeśhum̐ḍu ninu nalamelmaṁganu
yĕnasim̐ gŏsaridenu yichchu siru lippuḍe.