Mele neebhaagya malamelumamgaa ade

మేలే నీభాగ్య మలమేలుమంగా అదె
Language

(॥పల్లవి॥)
మేలే నీభాగ్య మలమేలుమంగా అదె
ఆలరి నీ పతి మెచ్చె నలమేలుమంగా*

(॥మేలే॥)
యెంచ రాక పతితోడ నిచ్చకము లాడి నేర్పు
మించితివి గదే యలమేలుమంగా
వంచనఁ బ్రియాలు సేసి వడి నాతనిచిత్తము
అంచెల దక్కఁ గొంటివే అలమేలుమంగా

(॥మేలే॥)
తఱితోడ మంచిజాణతనపుమాటల నెల్ల
మెఱసితి గదే యలమేలుమంగా
తెఱఁగుల నీపతికి తెల్లనినవ్వులు చల్లి
అఱచేతిమణి వైతి వలమేలుమంగా

(॥మేలే॥)
వొక్కటై శ్రీవేంకటేశవుర మెక్కి యేపొద్దు
మిక్కుట మైతివే యలమేలుమంగా
యెక్కువఁ బదారుమేలుయింతుల మతనికి మ
మ్మక్కర దీర మన్నించి తలమేలుమంగా

(||pallavi||)
mele nībhāgya malamelumaṁgā adĕ
ālari nī padi mĕchchĕ nalamelumaṁgā*

(||mele||)
yĕṁcha rāga padidoḍa nichchagamu lāḍi nerbu
miṁchidivi gade yalamelumaṁgā
vaṁchanam̐ briyālu sesi vaḍi nādanisittamu
aṁchĕla dakkam̐ gŏṁṭive alamelumaṁgā

(||mele||)
taṟidoḍa maṁchijāṇadanabumāḍala nĕlla
mĕṟasidi gade yalamelumaṁgā
tĕṟam̐gula nībadigi tĕllaninavvulu salli
aṟasedimaṇi vaidi valamelumaṁgā

(||mele||)
vŏkkaḍai śhrīveṁkaḍeśhavura mĕkki yebŏddu
mikkuḍa maidive yalamelumaṁgā
yĕkkuvam̐ badārumeluyiṁtula madanigi ma
mmakkara dīra manniṁchi talamelumaṁgā