Mele nee yaggaliga mechchidi nenu

మేలే నీ యగ్గలిక మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలే నీ యగ్గలిక మెచ్చితి నేను
సోలినున్న సతులెల్ల చూచేరు నిన్నును

(॥మేలే॥)
మాటలాడ నేరుతువే మగనితో సారెసారె
నాటుకొన సెలవుల నవ్వనేర్తువే
గాఁటమైననీకతలుఁ గారణాలుఁ జూచిచూచి
నీటున నివ్వెరగుతో నిలుచుందానవే

(॥మేలే॥)
వలపించనోపుదువే వంగి మొక్క నోపుదువే
కొలువులు సేసి చేకోనోపుదువే
తలపొసి నీవుసేసేతరితీపుఁ జేఁతలకు
తొలఁగక చెక్కుచేతితోఁ గూచుందాననే

(॥మేలే॥)
మన్నించుకోఁగలవే మరిగించుకోఁగలవే
చెన్నగునీగుణాల మెచ్చించఁగలవే
పన్ని యలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడు
నన్నునేలె యీతనిమన్ననలో నుందాననే

(||pallavi||)
mele nī yaggaliga mĕchchidi nenu
solinunna sadulĕlla sūseru ninnunu

(||mele||)
māḍalāḍa neruduve maganido sārĕsārĕ
nāḍugŏna sĕlavula navvanerduve
gām̐ṭamainanīgadalum̐ gāraṇālum̐ jūsisūsi
nīḍuna nivvĕragudo nilusuṁdānave

(||mele||)
valabiṁchanobuduve vaṁgi mŏkka nobuduve
kŏluvulu sesi segonobuduve
talabŏsi nīvusesedaridībum̐ jem̐talagu
tŏlam̐gaga sĕkkusedidom̐ gūsuṁdānane

(||mele||)
manniṁchugom̐galave marigiṁchugom̐galave
sĕnnagunīguṇāla mĕchchiṁcham̐galave
panni yalamel‌maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
nannunelĕ yīdanimannanalo nuṁdānane