(॥పల్లవి॥)
మేలే నీ నేరుపులు మెలఁత
చాలుకొన్న సరసాలు చవులాయను
(॥॥)
సూటి దప్పవు గదవే చూపులు నీవి
పాటించి నేఁడాతనిపై నిండెను
వాటమాయఁ గదవే నీవలపులు
కూటము లాతనివద్దఁ గుప్పలాయను
(॥॥)
నాములాయగదవే నీ నవ్వులు
కామించి యాతని మోహము కళ లెక్కెను
వాములువడెఁ గదవే వట్టి మాటలూ
కోమలపు వీనుల కొటారులఁ జేరెనూ
(॥॥)
కమ్ముకొనెఁ గదవే కౌగిలి నిది
పమ్మి శ్రీ వేంకటేశ్వరుఁ బాయ వెన్నఁడూ
చిమ్మిరేఁగెఁ గదవే చెమట లెల్లా
కుమ్మరింపు వేడుకల గుఱుతులాయనూ
(||pallavi||)
mele nī nerubulu mĕlam̐ta
sālugŏnna sarasālu savulāyanu
(||||)
sūḍi dappavu gadave sūbulu nīvi
pāḍiṁchi nem̐ḍādanibai niṁḍĕnu
vāḍamāyam̐ gadave nīvalabulu
kūḍamu lādanivaddam̐ guppalāyanu
(||||)
nāmulāyagadave nī navvulu
kāmiṁchi yādani mohamu kaḽa lĕkkĕnu
vāmuluvaḍĕm̐ gadave vaṭṭi māḍalū
komalabu vīnula kŏḍārulam̐ jerĕnū
(||||)
kammugŏnĕm̐ gadave kaugili nidi
pammi śhrī veṁkaḍeśhvarum̐ bāya vĕnnam̐ḍū
simmirem̐gĕm̐ gadave sĕmaḍa lĕllā
kummariṁpu veḍugala guṟudulāyanū