మేలయ్యా నీనేరుపు మెస్తిమి నేము
(॥పల్లవి॥)
మేలయ్యా నీనేరుపు మెస్తిమి నేము
యీ లీల నెందరిఁ బెండ్లి యిటు నీవాడితివో
(॥మేల॥)
వేడుకకు నొకమాట వెలఁది నీతో నవ్వితే
వాడిక సేసుక కూడి వచ్చేవు నీవు
వీడెము చేతికిచ్చి వినయాన మొక్కితేను
ఆడనె కాఁగిటఁ జేర్చే వదే సందుగాను
(॥మేల॥)
తెరలోనే వేగించి తియ్యని మోవితేనె
గురిసీ సారె సారెఁ గొమ్మ నీపైని
సురతపుఁగాంక్ష లెంతో చూపి చెప్పరానిమాట-
లరుదుగా గుబ్బతిల్లీ నదివో లోలోనను
(॥మేల॥)
పానుపుపైఁ బవ్వళించి పచ్చిచేఁతలఁ జన్నులు
కానుకిచ్చి బత్తిసేసీఁ గాంత నీపైని
పూని శ్రీవేంకటేశ నేర్పులెట్టొ తరితీపు
నాని పెక్కు భావములు ననిచీ లోలోనను
(||pallavi||)
melayyā nīnerubu mĕstimi nemu
yī līla nĕṁdarim̐ bĕṁḍli yiḍu nīvāḍidivo
(||mela||)
veḍugagu nŏgamāḍa vĕlam̐di nīdo navvide
vāḍiga sesuga kūḍi vachchevu nīvu
vīḍĕmu sedigichchi vinayāna mŏkkidenu
āḍanĕ kām̐giḍam̐ jerse vade saṁdugānu
(||mela||)
tĕralone vegiṁchi tiyyani movidenĕ
gurisī sārĕ sārĕm̐ gŏmma nībaini
suradabum̐gāṁkṣha lĕṁto sūbi sĕpparānimāḍa-
larudugā gubbadillī nadivo lolonanu
(||mela||)
pānububaim̐ bavvaḽiṁchi pachchisem̐talam̐ jannulu
kānugichchi battisesīm̐ gāṁta nībaini
pūni śhrīveṁkaḍeśha nerbulĕṭṭŏ taridību
nāni pĕkku bhāvamulu nanisī lolonanu