మేలయ్యా నీ సుద్దులకు మెచ్చితి నేను
(॥పల్లవి॥)
మేలయ్యా నీ సుద్దులకు మెచ్చితి నేను
నీ లాగు లొరసితే నేఁడు గొత్తయ్యీనా
(॥మేల॥)
చనవున నాపె నీతో జాణతనాలాడెనంటా
పెనగొని యెన్నేసి బీరా లాడేవు
మనసురాని యెడల మంచితనాలు సేసితే
యెనసినంతేకాక యెక్కుడయ్యీనా
(॥మేలు॥)
వొద్దనుండి యాకె నిన్ను వొడివట్టి తీసెనంటా
గద్దించి యెందాఁకా బింకాలు చూపేవు
పెద్దరికానకు నెంత ప్రియముతో మొక్కినాను
తిద్దుకొనే మంటేను చేతికి లోనయ్యీనా
(॥మేల॥)
కమ్మర నప్పటి నాపె కాఁగిలించుకొనెనంటా
నమ్మించి బాసలు మిన్నక చేసేవు
ఇమ్ముల శ్రీ వేంకటేశ యేలితివి మా చెలిని
సమ్మతాయ నిఁక మరి జంట వాసీనా
(||pallavi||)
melayyā nī suddulagu mĕchchidi nenu
nī lāgu lŏraside nem̐ḍu gŏttayyīnā
(||mela||)
sanavuna nābĕ nīdo jāṇadanālāḍĕnaṁṭā
pĕnagŏni yĕnnesi bīrā lāḍevu
manasurāni yĕḍala maṁchidanālu seside
yĕnasinaṁtegāga yĕkkuḍayyīnā
(||melu||)
vŏddanuṁḍi yāgĕ ninnu vŏḍivaṭṭi tīsĕnaṁṭā
gaddiṁchi yĕṁdām̐kā biṁkālu sūbevu
pĕddarigānagu nĕṁta priyamudo mŏkkinānu
tiddugŏne maṁṭenu sedigi lonayyīnā
(||mela||)
kammara nappaḍi nābĕ kām̐giliṁchugŏnĕnaṁṭā
nammiṁchi bāsalu minnaga sesevu
immula śhrī veṁkaḍeśha yelidivi mā sĕlini
sammadāya nim̐ka mari jaṁṭa vāsīnā