Melayya mimmum joosi mechchidi nenu

మేలయ్య మిమ్ముఁ జూచి మెచ్చితి నేను
Language

(॥పల్లవి॥)
మేలయ్య మిమ్ముఁ జూచి మెచ్చితి నేను
మేలములాడేరు మీరు మేళ్ళెట్టివో

(॥॥)
వెలఁది నీకుఁ జెవిలో విన్నపాలు సేయఁగాను
పులకించె నీమేను పొందు లెట్టివో
కులికి యట్టె విరులఁగొప్పు నీకు ముడువఁగ
జలజలఁ జెమరించె చవులెట్టివో

(॥॥)
సరినుండి వీడెమిచ్చి చన్నుల నిన్నొత్తఁగాను
తరవాత సిగ్గు రేఁగె తములెట్టివో
తెర వేసుకొని నీదో తేటలుగా నవ్వఁగాను
గొరబుచేఁతలు నిండె గుణా లెట్టివో

(॥॥)
కామించి ఇంతలో నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను
మోమునఁ గళలు రేఁగె మోహాలెట్టివో
ప్రేమపు శ్రీవేంకటేశ బెరసి నిన్నుఁ జూచితే
ఆమనాయ మోవితేనె లాస లెట్టివో

(||pallavi||)
melayya mimmum̐ jūsi mĕchchidi nenu
melamulāḍeru mīru meḽḽĕṭṭivo

(||||)
vĕlam̐di nīgum̐ jĕvilo vinnabālu seyam̐gānu
pulagiṁchĕ nīmenu pŏṁdu lĕṭṭivo
kuligi yaṭṭĕ virulam̐gŏppu nīgu muḍuvam̐ga
jalajalam̐ jĕmariṁchĕ savulĕṭṭivo

(||||)
sarinuṁḍi vīḍĕmichchi sannula ninnŏttam̐gānu
taravāda siggu rem̐gĕ tamulĕṭṭivo
tĕra vesugŏni nīdo teḍalugā navvam̐gānu
gŏrabusem̐talu niṁḍĕ guṇā lĕṭṭivo

(||||)
kāmiṁchi iṁtalo ninnum̐ gām̐giliṁchugŏnam̐gānu
momunam̐ gaḽalu rem̐gĕ mohālĕṭṭivo
premabu śhrīveṁkaḍeśha bĕrasi ninnum̐ jūside
āmanāya movidenĕ lāsa lĕṭṭivo