Melayya mannimchidivi melamta nee velam gaasi

మేలయ్య మన్నించితివి మెలఁత నీ వేళఁ గాచి
Language

(॥పల్లవి॥)
మేలయ్య మన్నించితివి మెలఁత నీ వేళఁ గాచి
తాలిమితో నిన్ను నిట్టే దక్కఁ గొనవలెను

(॥॥)
ఆముకొన్న జవ్వనము అది యెంత గలిగినా
కామించి నీ కరుణ గలదే కాంత
నేమముతో నాకె యెంత నేరుపులు నేరిచినా
దోమటి నీ మోవితేనె దొరకుటే భాగ్యము

(॥॥)
వే వేలు చక్కఁ దనాల విఱ్ఱవీఁ గు చుండినాను
నీవు చేపట్టి నదే నెయ్యపు సతి
తావుకొని మరి యెన్ని తా నోములు నోఁ చినాను
వోవరిలోని దేవులై వుండినదే భాగ్యము

(॥॥)
సాదించి మిక్కిలి యెంత సంపద గలిగినా నీ
వాదరించి కూడినదే అలమేల్మంగ
మోదపు శ్రీ వేంకటేశ ముంచి యీకె యెట్టుండినా
ఆది గొన్న నీ రతు లబ్బినదే భాగ్యము.

(||pallavi||)
melayya manniṁchidivi mĕlam̐ta nī veḽam̐ gāsi
tālimido ninnu niṭṭe dakkam̐ gŏnavalĕnu

(||||)
āmugŏnna javvanamu adi yĕṁta galiginā
kāmiṁchi nī karuṇa galade kāṁta
nemamudo nāgĕ yĕṁta nerubulu nerisinā
domaḍi nī movidenĕ dŏraguḍe bhāgyamu

(||||)
ve velu sakkam̐ danāla viṭravīm̐ gu suṁḍinānu
nīvu sebaṭṭi nade nĕyyabu sadi
tāvugŏni mari yĕnni tā nomulu nom̐ sinānu
vovariloni devulai vuṁḍinade bhāgyamu

(||||)
sādiṁchi mikkili yĕṁta saṁpada galiginā nī
vādariṁchi kūḍinade alamelmaṁga
modabu śhrī veṁkaḍeśha muṁchi yīgĕ yĕṭṭuṁḍinā
ādi gŏnna nī radu labbinade bhāgyamu.