Melamu lamaremgaa meegu meegunu

మేలము లమరెఁగా మీకు మీకును
Language

(॥పల్లవి॥)
మేలము లమరెఁగా మీకు మీకును
కోలుముందుగా పొందు గూడె వినవయ్యా

(॥మేల॥)
పేరడిగా సాళగపు పెద్ద యెలుఁగులతోడ
కోరికెఁ జల్లలమ్మేరు గొల్లతలు
బీరానఁ బెక్కురాగాలు పిల్లఁగోవిఁ గురిసేవు
కూరిమి రెంటికి సుతి గూడె వినవయ్యా

(॥మేల॥)
మించిన బంగారపు మెట్టెల మోఁతలతోడ
కొంచక నడచేరదే గొల్లెతలు
వుంచాన గతి గతుల నూదేవు తుత్తురుఁగొమ్ము
అంచలఁ దాళము గూడె నదె వినవయ్యా

(॥మేల॥)
వొత్తి పెరుగు దచ్చేటి వూరుపు మోఁతలతోడ
కొత్తగాఁ బేరుకొనేరు గొల్లెతలు
హత్తుకొంటివి శ్రీవేంకటాద్రి చెన్నుఁడవై
గుత్తపు గొబ్బిళ్ళపాట గూడె వినవయ్యా

(||pallavi||)
melamu lamarĕm̐gā mīgu mīgunu
kolumuṁdugā pŏṁdu gūḍĕ vinavayyā

(||mela||)
peraḍigā sāḽagabu pĕdda yĕlum̐guladoḍa
korigĕm̐ jallalammeru gŏlladalu
bīrānam̐ bĕkkurāgālu pillam̐govim̐ gurisevu
kūrimi rĕṁṭigi sudi gūḍĕ vinavayyā

(||mela||)
miṁchina baṁgārabu mĕṭṭĕla mom̐taladoḍa
kŏṁchaga naḍaserade gŏllĕdalu
vuṁchāna gadi gadula nūdevu tutturum̐gŏmmu
aṁchalam̐ dāḽamu gūḍĕ nadĕ vinavayyā

(||mela||)
vŏtti pĕrugu dachcheḍi vūrubu mom̐taladoḍa
kŏttagām̐ berugŏneru gŏllĕdalu
hattugŏṁṭivi śhrīveṁkaḍādri sĕnnum̐ḍavai
guttabu gŏbbiḽḽabāḍa gūḍĕ vinavayyā