Melammaa nee nerubu mechchidi mimdaramunu

మేలమ్మా నీ నేరుపు మెచ్చితి మిందరమును
Language

(॥పల్లవి॥)
మేలమ్మా నీ నేరుపు మెచ్చితి మిందరమును
పాలుపడి వూడిగాలు పయికొని సేసేపు

(॥మేలు॥)
కొత్తలుగాఁ జెలి వొద్దఁ గూచుండఁగా నతనితో
పొత్తు గలసి నీవునుఁ బొదిగేవు
బత్తి సేసి విడె మాపె పతిచేతి కిచ్చి తేను
హత్తి నీవు నంతలోనే ఆకు మడి చిచ్ఛేవు

(॥మేలు॥)
ప్రేమమున నింటి కాపె పిలుచుక వచ్చితేను
కామిం చాతనిపాదాలు గడిగేవు
గోమునఁ బాన్పుపై కాంతుఁ గోరి పవ్వళింపించితే
యేమే నీవు వచ్చి సారె నేక తాలాడేవు

(॥మేలు॥)
వేడుకతో నాతనికి విందాపె వడ్డించితేను
తోడనే నీవు దోమటి దొడికేవు
యీడనే శ్రీ వేంకటేశు నీపై కాఁగిటఁ గూడితే
వాడిక నీవు నిట్టే వలపు చల్లేవు

(||pallavi||)
melammā nī nerubu mĕchchidi miṁdaramunu
pālubaḍi vūḍigālu payigŏni sesebu

(||melu||)
kŏttalugām̐ jĕli vŏddam̐ gūsuṁḍam̐gā nadanido
pŏttu galasi nīvunum̐ bŏdigevu
batti sesi viḍĕ mābĕ padisedi kichchi tenu
hatti nīvu naṁtalone āgu maḍi sichchhevu

(||melu||)
premamuna niṁṭi kābĕ pilusuga vachchidenu
kāmiṁ sādanibādālu gaḍigevu
gomunam̐ bānpubai kāṁtum̐ gori pavvaḽiṁpiṁchide
yeme nīvu vachchi sārĕ nega tālāḍevu

(||melu||)
veḍugado nādanigi viṁdābĕ vaḍḍiṁchidenu
toḍane nīvu domaḍi dŏḍigevu
yīḍane śhrī veṁkaḍeśhu nībai kām̐giḍam̐ gūḍide
vāḍiga nīvu niṭṭe valabu sallevu