(॥పల్లవి॥)
మేలైన నాలైన మెచ్చే నాకు
ఆలకించి తను నవుఁగాదనఁబోయేనా
(॥మేలై॥)
యింతవిచారమేల యిందుకుఁగాను ఆతఁ-
డెంతసేసిన నదే యితవు నాకు
సంతసమైతే దనకు జాలుగాక నే -
నెంతకోరిచిన నేమాయరా
(॥మేలై॥)
వేమారుఁ దనకు నే విన్నవించనోప నిట్టె
యేమని యానతిచ్చిన యింపే నాకు
దీమసాన నీవేళఁ దీరకున్న మానెఁగాక
ప్రేమ మీఁదటికైనాఁ బెంచకుండీనా
(॥మేలై॥)
పలుమారుఁ బంతమిచ్చి పలుకఁగాని యెంత
చలిమైన బలిమైన సమ్మతే నాకు
వలసి శ్రీవేంకటేశ్వరుఁడు గూడెఁ గాక
తొలుత నిటులైతే నే దూరఁబొయ్యేనా
(||pallavi||)
melaina nālaina mĕchche nāgu
ālagiṁchi tanu navum̐gādanam̐boyenā
(||melai||)
yiṁtavisāramela yiṁdugum̐gānu ādam̐-
ḍĕṁtasesina nade yidavu nāgu
saṁtasamaide danagu jālugāga ne -
nĕṁtagorisina nemāyarā
(||melai||)
vemārum̐ danagu ne vinnaviṁchanoba niṭṭĕ
yemani yānadichchina yiṁpe nāgu
dīmasāna nīveḽam̐ dīragunna mānĕm̐gāga
prema mīm̐daḍigainām̐ bĕṁchaguṁḍīnā
(||melai||)
palumārum̐ baṁtamichchi palugam̐gāni yĕṁta
salimaina balimaina sammade nāgu
valasi śhrīveṁkaḍeśhvarum̐ḍu gūḍĕm̐ gāga
tŏluda niḍulaide ne dūram̐bŏyyenā