(॥పల్లవి॥)
మేకులాఁడిగదె యలమేలుమంగ
ఆకె యీతనికే తగు నలమేలుమంగ
(॥మేకు ॥)
చెక్కులచెమటలతో చెలువునియెదుటనె
మిక్కిలి చొక్కీ నలమేలుమంగ
మొక్కలాన చెలులతో ముచ్చటలు చెప్పి చెప్పి
అక్కడే చూచీఁ గదె ఆలమేలుమంగ
(॥మేకు॥)
చాలుకొని పతితోఁ జల్లు వెదమాటలనె
మేలములాడీ నలమేలుమంగ
తాళమొత్తి పాటపాడి తనలోనే నవ్వీని
ఆలరివిభునివద్ద నలమేలుమంగ
(॥మేకు॥)
యీడ నిట్టె శ్రీవేంకటేశుని మెప్పించి కూడె
మేడెపుఁగాఁగిట నలమేలు మంగ
వీడెపురసములనే వీడుదోడై రతులలో
ఆడుకోలుమాఁట లాడీ నలమేలుమంగ
(||pallavi||)
megulām̐ḍigadĕ yalamelumaṁga
āgĕ yīdanige tagu nalamelumaṁga
(||megu ||)
sĕkkulasĕmaḍalado sĕluvuniyĕduḍanĕ
mikkili sŏkkī nalamelumaṁga
mŏkkalāna sĕlulado muchchaḍalu sĕppi sĕppi
akkaḍe sūsīm̐ gadĕ ālamelumaṁga
(||megu||)
sālugŏni padidom̐ jallu vĕdamāḍalanĕ
melamulāḍī nalamelumaṁga
tāḽamŏtti pāḍabāḍi tanalone navvīni
ālarivibhunivadda nalamelumaṁga
(||megu||)
yīḍa niṭṭĕ śhrīveṁkaḍeśhuni mĕppiṁchi kūḍĕ
meḍĕbum̐gām̐giḍa nalamelu maṁga
vīḍĕburasamulane vīḍudoḍai radulalo
āḍugolumām̐ṭa lāḍī nalamelumaṁga