Meevamtidaana nade meeramga nenu

మీవంటిదాన నటె మీరఁగ నేను
Language

(॥పల్లవి॥)
మీవంటిదాన నటె మీరఁగ నేను
పూవుఁ బరిమళమై పొదిగేఁ గాక

(॥మీవం॥)
చలము సాదించేనటే సలిగెగలదానను
బలువుకొద్ది పంతానఁ బతికేఁగాక
అలిగేనటే పతి కంతరంగమైనదాన
పలుకురసమునఁ బైకొనేఁగాక

(॥మీవం॥)
తప్పు లెంచేనటవే తగినచుట్టపుదాన
ఎప్పుడూ మేలుదాననై యెనసేఁగాక
వుప్పటించేనటే నేను వూడిగముసేసేదాన
దప్పిదేర మోవితేనెఁ దనిపేఁగాక

(॥మీవం॥)
వొరసేనటవే నేను వురమెక్కినట్టిదాన
గరిమఁ గాఁగిట నించి కైకొనేఁగాక
యిరవై శ్రీవేంకటేశుఁ డిదివో నన్ను మన్నించె
సరిలేనివేడుకల సతమయ్యేఁగాక

(||pallavi||)
mīvaṁṭidāna naḍĕ mīram̐ga nenu
pūvum̐ barimaḽamai pŏdigem̐ gāga

(||mīvaṁ||)
salamu sādiṁchenaḍe saligĕgaladānanu
baluvugŏddi paṁtānam̐ badigem̐gāga
aligenaḍe padi kaṁtaraṁgamainadāna
palugurasamunam̐ baigŏnem̐gāga

(||mīvaṁ||)
tappu lĕṁchenaḍave taginasuṭṭabudāna
ĕppuḍū meludānanai yĕnasem̐gāga
vuppaḍiṁchenaḍe nenu vūḍigamusesedāna
dappidera movidenĕm̐ danibem̐gāga

(||mīvaṁ||)
vŏrasenaḍave nenu vuramĕkkinaṭṭidāna
garimam̐ gām̐giḍa niṁchi kaigŏnem̐gāga
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidivo nannu manniṁchĕ
sarileniveḍugala sadamayyem̐gāga