Meeru sese panulagu memu gore panu lemi

మీరు సేసే పనులకు మేము గోరే పను లేమి
Language

(॥పల్లవి॥)
మీరు సేసే పనులకు మేము గోరే పను లేమి
నేరుపు నీ దైవికమే నెరపుదు గాకా

(॥మీరు॥)
ఎవ్వరు నీకుఁ జెప్పఁగా నిల నపాండవ మంటే
అవ్వలఁ గాకుండుఁ గాక అని యంటివి
నెవ్వగ విభీషణుఁడు నిన్నేమి వేఁడుకొనఁగా
రవ్వగా నట్టే లంకారాజ్య మొసంగితివి

(॥మీరు॥)
రమ్మని యెవ్వరనఁగా రాముఁడవై విచ్చేసి
యిమ్ముల నహల్య శాప మిటు దీర్చితి
దొమ్మిలో నేమి చెప్పఁగా దూరి విజయునికై
కమ్మర భీష్మునిపై జక్ర మేల యెత్తిలివి

(॥మీరు॥)
చెలఁగి ధ్రువుని కెల్ల చెక్కుల నీ శంఖ మూఁది
పలునుతులు చేకొని పట్ట మిచ్చితి
యెలమి శ్రీ వేంకటేశ యేమీ నెఱుఁగము
యిల నిరుహేతుకాన నెట్లైనఁ గావవే

(||pallavi||)
mīru sese panulagu memu gore panu lemi
nerubu nī daivigame nĕrabudu gāgā

(||mīru||)
ĕvvaru nīgum̐ jĕppam̐gā nila nabāṁḍava maṁṭe
avvalam̐ gāguṁḍum̐ gāga ani yaṁṭivi
nĕvvaga vibhīṣhaṇum̐ḍu ninnemi vem̐ḍugŏnam̐gā
ravvagā naṭṭe laṁkārājya mŏsaṁgidivi

(||mīru||)
rammani yĕvvaranam̐gā rāmum̐ḍavai vichchesi
yimmula nahalya śhāba miḍu dīrsidi
dŏmmilo nemi sĕppam̐gā dūri vijayunigai
kammara bhīṣhmunibai jakra mela yĕttilivi

(||mīru||)
sĕlam̐gi dhruvuni kĕlla sĕkkula nī śhaṁkha mūm̐di
palunudulu segŏni paṭṭa michchidi
yĕlami śhrī veṁkaḍeśha yemī nĕṟum̐gamu
yila niruhedugāna nĕṭlainam̐ gāvave