మీరు మీరు నేకమే మేమును మీవారమే
(॥పల్లవి॥)
మీరు మీరు నేకమే మేమును మీవారమే
కూరిమితో కొసరలు కోపమయ్యీనా
(॥మీరు॥)
తెరమఱఁగు దీసితే తేరె మీకు సిగ్గులు
వొరసితే వలపులు వొడి నిండెను
గరిమ నందరికినిఁ గలిగిన దొక్కచాలే
సరసపు జగడాలు సతమయ్యీనా
(॥మీరు॥)
మొగము చూచితేనే మొలచెను నవ్వులు
అగపడితే నీడేరె నాసలెల్లాను
తగిన వయసువారితలనే వేగె నీపని
బిగువుల బింకాలు పేరడయ్యీనా
(॥మీరు॥)
మంతనాన నుండితేనే మనసు లేకము లాయ
సంతసించుకొంటేనే చలము వాసె
యింతలో శ్రీ వేంకటేశ యెనసితి రిద్దరును
బంతి నున్న రతివిందు పంగెనయ్యీనా
(||pallavi||)
mīru mīru negame memunu mīvārame
kūrimido kŏsaralu kobamayyīnā
(||mīru||)
tĕramaṟam̐gu dīside terĕ mīgu siggulu
vŏraside valabulu vŏḍi niṁḍĕnu
garima naṁdariginim̐ galigina dŏkkasāle
sarasabu jagaḍālu sadamayyīnā
(||mīru||)
mŏgamu sūsidene mŏlasĕnu navvulu
agabaḍide nīḍerĕ nāsalĕllānu
tagina vayasuvāridalane vegĕ nībani
biguvula biṁkālu peraḍayyīnā
(||mīru||)
maṁtanāna nuṁḍidene manasu legamu lāya
saṁtasiṁchugŏṁṭene salamu vāsĕ
yiṁtalo śhrī veṁkaḍeśha yĕnasidi riddarunu
baṁti nunna radiviṁdu paṁgĕnayyīnā