మీఱితివి గదవమ్మ మెచ్చితిమి నీ సుద్దులు
(॥పల్లవి॥)
మీఱితివి గదవమ్మ మెచ్చితిమి నీ సుద్దులు
ఆఱడిఁ బెట్టకువమ్మ అలమేలుమంగా
(॥మీఱి॥)
పాయపువిభుఁడు తన్నుఁ బట్టి పెనఁగఁజూచితే
చాయకు వచ్చినదే సరసాలు
చేయిచాఁచి మీఁదమీఁద చెక్కునొక్కి వేఁడుకొంటే
రాయడి కోర్చినదే రసికురాలు
(॥మీఱి॥)
సంగతిగా మాటలాడి సన్నలుసేసితేను
అంగము లంటినదే అధికురాలు
చెంగటఁ గన్నులెదుటఁ జేసినచేఁతలకెల్లా
కంగువెట్టుకోనిదే ఘనురాలు
(॥మీఱి॥)
యిత్తలఁ జేతికిలోనై యెంతచన విచ్చినాను
తత్తరించకుండినదే దారకురాలు
బత్తితో శ్రీవేంకటాద్రిపతి నిన్ను నిదె కూడె
కొత్తగా నీవంటిదే కోవిదురాలు
(||pallavi||)
mīṟidivi gadavamma mĕchchidimi nī suddulu
āṟaḍim̐ bĕṭṭaguvamma alamelumaṁgā
(||mīṟi||)
pāyabuvibhum̐ḍu tannum̐ baṭṭi pĕnam̐gam̐jūside
sāyagu vachchinade sarasālu
seyisām̐si mīm̐damīm̐da sĕkkunŏkki vem̐ḍugŏṁṭe
rāyaḍi korsinade rasigurālu
(||mīṟi||)
saṁgadigā māḍalāḍi sannalusesidenu
aṁgamu laṁṭinade adhigurālu
sĕṁgaḍam̐ gannulĕduḍam̐ jesinasem̐talagĕllā
kaṁguvĕṭṭugonide ghanurālu
(||mīṟi||)
yittalam̐ jedigilonai yĕṁtasana vichchinānu
tattariṁchaguṁḍinade dāragurālu
battido śhrīveṁkaḍādribadi ninnu nidĕ kūḍĕ
kŏttagā nīvaṁṭide kovidurālu