మీఱితే వారికెదురా మీఁదుఁగిందు నెంచికాక
(॥పల్లవి॥)
మీఱితే వారికెదురా మీఁదుఁగిందు నెంచికాక
ఆఱడయ్యీఁ జుమ్మీ తాను ఆడనేలున్నాఁడే
(॥మీఱి॥)
తానేమి సేసీనే లోన, తరుణులు వాకిటను
కానుకలు దెచ్చుకొని కాచుకుండఁగా
లోనికేవత్తురు వారు లోకులు మెచ్చవలసి
మానవతులు గనక మట్టున నున్నారు
(॥మీఱి॥)
చప్పుడేమిసేసీనే సతులెల్ల దనచేఁత
కప్పురపు నోళ్ల నాడఁ గాచుకుండఁగా
వుప్పతించనేరరా వూరెల్ల మెచ్చవలసి
ముప్పిరి నిల్లాండ్లుగాన మోమోట నున్నారు
(॥మీఱి॥)
నన్నేలొడఁబరచీనే నాతులెల్లా గుంపుగట్టి
కన్నెపాయా లొప్పగించఁ గాచుకుండఁగా
నన్నుఁగూడె శ్రీ వేంకటనాయకుఁడు నే మెచ్చఁగా
చన్నల తామునుఁ గూడి సమ్మతించున్నారు
(||pallavi||)
mīṟide vārigĕdurā mīm̐dum̐giṁdu nĕṁchigāga
āṟaḍayyīm̐ jummī tānu āḍanelunnām̐ḍe
(||mīṟi||)
tānemi sesīne lona, taruṇulu vāgiḍanu
kānugalu dĕchchugŏni kāsuguṁḍam̐gā
lonigevatturu vāru logulu mĕchchavalasi
mānavadulu ganaga maṭṭuna nunnāru
(||mīṟi||)
sappuḍemisesīne sadulĕlla danasem̐ta
kappurabu noḽla nāḍam̐ gāsuguṁḍam̐gā
vuppadiṁchanerarā vūrĕlla mĕchchavalasi
muppiri nillāṁḍlugāna momoḍa nunnāru
(||mīṟi||)
nannelŏḍam̐barasīne nādulĕllā guṁpugaṭṭi
kannĕbāyā lŏppagiṁcham̐ gāsuguṁḍam̐gā
nannum̐gūḍĕ śhrī veṁkaḍanāyagum̐ḍu ne mĕchcham̐gā
sannala tāmunum̐ gūḍi sammadiṁchunnāru