మీరిద్దరు నొక్కటే మేమెంతటివారము
(॥పల్లవి॥)
మీరిద్దరు నొక్కటే మేమెంతటివారము
కోరి మిమ్ము నిట్టె కాదుగూడదనఁగలమా
(॥మీరి॥)
సిగ్గువడియుండి నాపెఁ జెఱఁగువట్టి తీసితే
యెగ్గులెల్లా నిన్ను నాపె యెంచకుండునా
వెగ్గళించి చెలులతో వేమారు నానతిచ్చేవు
బగ్గనఁ బంతమిప్పించి పాడిదిద్దఁగలమా
(॥మీరి॥)
కొలువులో నుండఁగాను కొమ్మచన్ను లంటితే
చలపట్టి నిన్ను నిట్టె జంకించవద్దా
తలకొని నీవింరు కందరి సాకిరివెట్టేవు
పిలిచి మిమ్ముఁ గాఁగిలింపించఁ గలమా
(॥మీరి॥)
మంతనమాడేయలమేల్మంగనుఁ జెనకితేను
పొంతఁ జన్నుల నిన్నొత్తి పొందకుండునా
ఇంతలో శ్రీవేంకటేశ యెనసితి వీకెను
వంతువెట్టి మీ కింకాను వాసిరేఁచఁగలమా
(||pallavi||)
mīriddaru nŏkkaḍe memĕṁtaḍivāramu
kori mimmu niṭṭĕ kādugūḍadanam̐galamā
(||mīri||)
sigguvaḍiyuṁḍi nābĕm̐ jĕṟam̐guvaṭṭi tīside
yĕggulĕllā ninnu nābĕ yĕṁchaguṁḍunā
vĕggaḽiṁchi sĕlulado vemāru nānadichchevu
bagganam̐ baṁtamippiṁchi pāḍididdam̐galamā
(||mīri||)
kŏluvulo nuṁḍam̐gānu kŏmmasannu laṁṭide
salabaṭṭi ninnu niṭṭĕ jaṁkiṁchavaddā
talagŏni nīviṁru kaṁdari sāgirivĕṭṭevu
pilisi mimmum̐ gām̐giliṁpiṁcham̐ galamā
(||mīri||)
maṁtanamāḍeyalamelmaṁganum̐ jĕnagidenu
pŏṁtam̐ jannula ninnŏtti pŏṁdaguṁḍunā
iṁtalo śhrīveṁkaḍeśha yĕnasidi vīgĕnu
vaṁtuvĕṭṭi mī kiṁkānu vāsirem̐sam̐galamā