Meereṟamgaradare melumtalaala

మీరెఱఁగరటరే మెలుఁతలాల
Language

(॥పల్లవి॥)
మీరెఱఁగరటరే మెలుఁతలాల
చేరి నన్నెంతేసి గరిసించేరే చెలులు

(॥మీరె॥)
వల పెంత గలదని వర్ణించి యడుగనేల
తలపెంతగలిగె నెంతము నంతే
చెలిమి కొలఁది వెట్టి చెప్పిచూపఁగరాదు
కెలయు రాకొట్ల కిచ్చగించుటే కొలఁది

(॥మీరె॥)
సింగారము లెక్కవెట్టి చెలఁగి వర్ణించనేల
అంగమెంట గలిగెను అంతానంతే
తోఁగిచూపు లాసలకు తొడర నెందాఁకాగురి
పంగెనలేక కలసి పాయకుండుటే గురి

(॥మీరె॥)
రతికాంక్ష కొలవెట్టి రచ్చలో వర్ణించనేల
పతిఇతవెంత తనభావమూ నంతే
తతి శ్రీవేంకటేశుఁడు తా నలమేలుమంగను
సతమై కూడియుండేది సాజమే యిద్దరికి

(||pallavi||)
mīrĕṟam̐garaḍare mĕlum̐talāla
seri nannĕṁtesi garisiṁchere sĕlulu

(||mīrĕ||)
vala pĕṁta galadani varṇiṁchi yaḍuganela
talabĕṁtagaligĕ nĕṁtamu naṁte
sĕlimi kŏlam̐di vĕṭṭi sĕppisūbam̐garādu
kĕlayu rāgŏṭla kichchagiṁchuḍe kŏlam̐di

(||mīrĕ||)
siṁgāramu lĕkkavĕṭṭi sĕlam̐gi varṇiṁchanela
aṁgamĕṁṭa galigĕnu aṁtānaṁte
tom̐gisūbu lāsalagu tŏḍara nĕṁdām̐kāguri
paṁgĕnalega kalasi pāyaguṁḍuḍe guri

(||mīrĕ||)
radigāṁkṣha kŏlavĕṭṭi rachchalo varṇiṁchanela
padiidavĕṁta tanabhāvamū naṁte
tadi śhrīveṁkaḍeśhum̐ḍu tā nalamelumaṁganu
sadamai kūḍiyuṁḍedi sājame yiddarigi