మీరెంత బ్రమయించేరే మీతోఁ బొందు సేసె(సీ?)నంటా
(॥పల్లవి॥)
మీరెంత బ్రమయించేరే మీతోఁ బొందు సేసె(సీ?)నంటా
వూరివారితోనెల్లా వొకఁ డోపఁగలఁడా
(॥మీరెంత॥)
పందెమాడుతానున్నాఁడు పతివీఁపునఁ జన్నులు
సందడి నేల వొత్తేరే సతులెల్లా
మందలించి పరాకైతే మనసెందుపైఁ బారునో
ముందువెనకల రెంటా మోసపుచ్చ నేఁటికి
(॥మీరెంత॥)
సారె చేతఁ బట్టినాఁడు సారెఁ గానుక గొమ్మంటా
గోరులేల తాఁకించేరే కొమ్మలెల్లాను
యీరీతి దొమ్మిసేసితే నెందుఁ దగులాయమౌనో
పేరడి నింతేసి పిరువీకు సేయనేఁటికి
(॥మీరెంత॥)
తడవుగా నాడినాఁడు తగిలి శ్రీవేంకటేశు-
వొడిపై నేల కూచుండే రువిదలెల్లా
అడరి పైకొంటేను ఆస యెందుఁ బుట్టునో
తడఁబాటు సేసి ఇంత తమకించనేఁటికి
(||pallavi||)
mīrĕṁta bramayiṁchere mīdom̐ bŏṁdu sesĕ(sī?)naṁṭā
vūrivāridonĕllā vŏgam̐ ḍobam̐galam̐ḍā
(||mīrĕṁta||)
paṁdĕmāḍudānunnām̐ḍu padivīm̐punam̐ jannulu
saṁdaḍi nela vŏttere sadulĕllā
maṁdaliṁchi parāgaide manasĕṁdubaim̐ bāruno
muṁduvĕnagala rĕṁṭā mosabuchcha nem̐ṭigi
(||mīrĕṁta||)
sārĕ sedam̐ baṭṭinām̐ḍu sārĕm̐ gānuga gŏmmaṁṭā
gorulela tām̐kiṁchere kŏmmalĕllānu
yīrīdi dŏmmiseside nĕṁdum̐ dagulāyamauno
peraḍi niṁtesi piruvīgu seyanem̐ṭigi
(||mīrĕṁta||)
taḍavugā nāḍinām̐ḍu tagili śhrīveṁkaḍeśhu-
vŏḍibai nela kūsuṁḍe ruvidalĕllā
aḍari paigŏṁṭenu āsa yĕṁdum̐ buṭṭuno
taḍam̐bāḍu sesi iṁta tamagiṁchanem̐ṭigi