మీరేమి బుద్ధిచెప్పేరే మెలుఁతలాలా
(॥పల్లవి॥)
మీరేమి బుద్ధిచెప్పేరే మెలుఁతలాలా
నా రమణుని గుణాలు నాకే తెలుసును
(॥మీరే॥)
సంతోసాన నుండి సరసములాడవచ్చుఁగాక
పంతములాడవచ్చుగా పతితోను
దొంతర రతుల గూడి తులఁదూఁగవచ్చుఁగాక
వింత వింత కపటాల విఱ్ఱవీఁగవచ్చునా
(॥మీరే॥)
చొక్కముగా సేవసేసి సొలయఁగవచ్చుఁగాక
కక్కసించవచ్చునా కాంతునితోను
చెక్కునొక్కి చనవునఁ జెనకఁగవచ్చుఁగాక
పెక్కులాగుల జంకించి పెనఁగఁగవచ్చునా
(॥మీరే॥)
కూరిమితో నవ్వు నవ్వి కొసరఁగవచ్చుఁగాక
బీరమాడవచ్చునా ప్రియునితోను
యీరీతి శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
దారకపు చేఁతలను తప్పులెంచవచ్చునా
(||pallavi||)
mīremi buddhisĕppere mĕlum̐talālā
nā ramaṇuni guṇālu nāge tĕlusunu
(||mīre||)
saṁtosāna nuṁḍi sarasamulāḍavachchum̐gāga
paṁtamulāḍavachchugā padidonu
dŏṁtara radula gūḍi tulam̐dūm̐gavachchum̐gāga
viṁta viṁta kabaḍāla viṭravīm̐gavachchunā
(||mīre||)
sŏkkamugā sevasesi sŏlayam̐gavachchum̐gāga
kakkasiṁchavachchunā kāṁtunidonu
sĕkkunŏkki sanavunam̐ jĕnagam̐gavachchum̐gāga
pĕkkulāgula jaṁkiṁchi pĕnam̐gam̐gavachchunā
(||mīre||)
kūrimido navvu navvi kŏsaram̐gavachchum̐gāga
bīramāḍavachchunā priyunidonu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
dāragabu sem̐talanu tappulĕṁchavachchunā