(॥పల్లవి॥)
మీరే యెఱఁగవలె మీ వలపులు
తారుకాణలెల్లా లోలో తలఁచుకోరయ్యా
(॥మీరే॥)
మొగమిచ్చచెలులము మొనసి మీ కిద్దరికి
తగవులు చెప్పిమా దండ నుండి
నగవుల చుట్టాలము నడుమ బుద్ది నేర్పేమా
పొగడి పొగడి మిమ్ముఁ బోదిసేతుముగాక
(॥మీరే॥)
పూడిగపు వారము వొరపులు దిద్ది దిద్ది
జాడలు దెలిపవ సారె సారెకు
వేడుకపడేవారము వెగటుగాఁ గొసరేమా
జోడు గూడించి మిమ్ముఁజొక్కింతుము గాక
(॥మీరే॥)
చనవరి వారము సరికి బేసికి మిమ్ము
పెనఁగు లాడించేమా బీరముతోను
యెనసితివి శ్రీ వేంకటేశ నీవు నాపెను
వొనర మిమ్ము మెప్పించి వుండుదుముగాక
(||pallavi||)
mīre yĕṟam̐gavalĕ mī valabulu
tārugāṇalĕllā lolo talam̐sugorayyā
(||mīre||)
mŏgamichchasĕlulamu mŏnasi mī kiddarigi
tagavulu sĕppimā daṁḍa nuṁḍi
nagavula suṭṭālamu naḍuma buddi nerbemā
pŏgaḍi pŏgaḍi mimmum̐ bodisedumugāga
(||mīre||)
pūḍigabu vāramu vŏrabulu diddi diddi
jāḍalu dĕlibava sārĕ sārĕgu
veḍugabaḍevāramu vĕgaḍugām̐ gŏsaremā
joḍu gūḍiṁchi mimmum̐jŏkkiṁtumu gāga
(||mīre||)
sanavari vāramu sarigi besigi mimmu
pĕnam̐gu lāḍiṁchemā bīramudonu
yĕnasidivi śhrī veṁkaḍeśha nīvu nābĕnu
vŏnara mimmu mĕppiṁchi vuṁḍudumugāga