Meere yeramgaraa yinni medijaanalu

మీరే యెరఁగరా యిన్ని మేటిజాణలు
Language

(॥పల్లవి॥)
మీరే యెరఁగరా యిన్ని మేటిజాణలు
మారుమోము లిఁకనేల మాటాడరాదా

(॥మీరే॥)
సతమైన కూరిమికి సాదించనేల
హితవైన వినయాలే యింపులుగాక
కుతిలంబులేని మతి కొరనేల
రతికెక్కె చనవు మెరయుటగాక

(॥మీరే॥)
ఆసపడ్డ చూపులకు నడ్డాఁకలేల
వేసటలేక నవ్వుటే వేడుకగాక
సేసవాలవావులకు సిబ్బితియేల
మోసపోని కూటములే ముచ్చటలుగాక

(॥మీరే॥)
ఆయాలు సోఁకిన పనికచ్చికమేలా
చాయలు సన్నలునే చవులుగాక
యీయెడ శ్రీవేంకటేశ యింతీనీవూఁ గూడితిరి
రేయిఁబగలివే పెరరేఁపులు గాక

(||pallavi||)
mīre yĕram̐garā yinni meḍijāṇalu
mārumomu lim̐kanela māḍāḍarādā

(||mīre||)
sadamaina kūrimigi sādiṁchanela
hidavaina vinayāle yiṁpulugāga
kudilaṁbuleni madi kŏranela
radigĕkkĕ sanavu mĕrayuḍagāga

(||mīre||)
āsabaḍḍa sūbulagu naḍḍām̐kalela
vesaḍalega navvuḍe veḍugagāga
sesavālavāvulagu sibbidiyela
mosaboni kūḍamule muchchaḍalugāga

(||mīre||)
āyālu som̐kina panigachchigamelā
sāyalu sannalune savulugāga
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁtīnīvūm̐ gūḍidiri
reyim̐bagalive pĕrarem̐pulu gāga