Meeṟaraadu dooraraadu menavaanivalenaaya

మీఱరాదు దూరరాదు మేనవానివలెనాయ
Language

(॥పల్లవి॥)
మీఱరాదు దూరరాదు మేనవానివలెనాయ
ఆఱడి నీతోడి పొందు లగడాయ నిఁకను

(॥మీఱ॥)
చేరి మాటలాడఁబోతే సెలవుల నవ్వు చిందీ
వూరకుంటే పెంజెమట లుమ్మగిలీని
యీరీతి ముందరనుయ్యి యెంచ వెనకఁ దగరు
యేరా నీతోడిపొందు యేమిసేతు నిఁకను

(॥మీఱ॥)
తప్పకచూడఁగఁబోతే తనువెల్లాఁ బులఁకించే
రెప్పలు మూసిన కాఁకరేఁగీని
విప్పకపట్టితే నుమ్మ విడిచి తేనెగారీ
తిప్పరానినీపొందు ద్రిష్టమాయ నిఁకను

(॥మీఱ॥)
మోవి చవిగొంటేను మోహ మగ్గలమయ్యి
తావితములమందితే తమివుట్టీని
యీవేళ మందాఁబాలు యింటాఁ బాశమాయ
శ్రీవేంకటేశ కూడితి చెప్పరాదు ఇఁకను

(||pallavi||)
mīṟarādu dūrarādu menavānivalĕnāya
āṟaḍi nīdoḍi pŏṁdu lagaḍāya nim̐kanu

(||mīṟa||)
seri māḍalāḍam̐bode sĕlavula navvu siṁdī
vūraguṁṭe pĕṁjĕmaḍa lummagilīni
yīrīdi muṁdaranuyyi yĕṁcha vĕnagam̐ dagaru
yerā nīdoḍibŏṁdu yemisedu nim̐kanu

(||mīṟa||)
tappagasūḍam̐gam̐bode tanuvĕllām̐ bulam̐kiṁche
rĕppalu mūsina kām̐karem̐gīni
vippagabaṭṭide numma viḍisi tenĕgārī
tipparāninībŏṁdu driṣhṭamāya nim̐kanu

(||mīṟa||)
movi savigŏṁṭenu moha maggalamayyi
tāvidamulamaṁdide tamivuṭṭīni
yīveḽa maṁdām̐bālu yiṁṭām̐ bāśhamāya
śhrīveṁkaḍeśha kūḍidi sĕpparādu im̐kanu