Meerainaa buddiseppe melumtalaala

మీరైనా బుద్దిచెప్పే మెలుఁతలాల
Language

(॥పల్లవి॥)
మీరైనా బుద్దిచెప్పే మెలుఁతలాల
దార దప్పనివానికి తగవులౌనటవే

(॥మీరై॥)
మంతనమాఁడేటివాఁడు మరేల రొదసేసీని
పంతగాఁడయినవాఁడు పైకొననేలే
వంతులు వెదకేవాఁడు వాసులెంచవలెనటె
ఇంతా విచారించుకొంటే నివి వోజలటవే

(॥మీరై॥)
చట్టమైవుండేటివాఁడు చొక్కులఁ బెట్టనేఁటికే
నెట్టుకొన్నవానికి నేరమేడదే
జట్టిగొన్నవాఁడట చలము సాదింతురటే
దట్టపు దొరైనవాఁడు తమకించునటవే

(॥మీరై॥)
రతుల మెప్పించేవాఁడు రవ్వసేయనేఁటికే
చతురుడయినవాఁడు చలమేఁటికే
ఇతవై శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
గతియై నన్నేలినాఁడు కాఁతాళించునటవే

(||pallavi||)
mīrainā buddisĕppe mĕlum̐talāla
dāra dappanivānigi tagavulaunaḍave

(||mīrai||)
maṁtanamām̐ḍeḍivām̐ḍu marela rŏdasesīni
paṁtagām̐ḍayinavām̐ḍu paigŏnanele
vaṁtulu vĕdagevām̐ḍu vāsulĕṁchavalĕnaḍĕ
iṁtā visāriṁchugŏṁṭe nivi vojalaḍave

(||mīrai||)
saṭṭamaivuṁḍeḍivām̐ḍu sŏkkulam̐ bĕṭṭanem̐ṭige
nĕṭṭugŏnnavānigi nerameḍade
jaṭṭigŏnnavām̐ḍaḍa salamu sādiṁturaḍe
daṭṭabu dŏrainavām̐ḍu tamagiṁchunaḍave

(||mīrai||)
radula mĕppiṁchevām̐ḍu ravvaseyanem̐ṭige
saduruḍayinavām̐ḍu salamem̐ṭige
idavai śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
gadiyai nannelinām̐ḍu kām̐tāḽiṁchunaḍave