మీరైనా బుద్ది చెప్పరే మెలుఁతలాల
(॥పల్లవి॥)
మీరైనా బుద్ది చెప్పరే మెలుఁతలాల
యీరీతివానితో నే నేమనఁగఁగలనే
(॥మీరై॥)
యేకతానఁ దాను నాపె యింటిలోన నుండఁగా మిమ్ము
సాకిరివెట్టుతలేదా సతులాల
దీకొని సాదించవచ్చీ తిరిగి తిరిగి నాతో
యీకడ నీతని నే నేమనఁగఁగలనే
(॥మీరై॥)
మనసిచ్చి తానుఁదాను మాటలాడుకొనఁగాను
వినిపించనా మీకు వెలఁదులాల
పనివడి యామాటకు పరాకులు సేసీని
యెనసి యిట్టివానితో నేమనఁగఁగలనే
(॥మీరై॥)
అన్నిటాఁ దాము జూజాలాడుకొనఁగా మీకు
సన్నలఁ జూపుటలేదా సకియలాల
చిన్నియలమేల్మంగను శ్రీ వేంకటేశుఁడు గూడె
యెన్నఁగ నన్నూ నేలె నేమనఁగఁగలనే
(||pallavi||)
mīrainā buddi sĕppare mĕlum̐talāla
yīrīdivānido ne nemanam̐gam̐galane
(||mīrai||)
yegadānam̐ dānu nābĕ yiṁṭilona nuṁḍam̐gā mimmu
sāgirivĕṭṭudaledā sadulāla
dīgŏni sādiṁchavachchī tirigi tirigi nādo
yīgaḍa nīdani ne nemanam̐gam̐galane
(||mīrai||)
manasichchi tānum̐dānu māḍalāḍugŏnam̐gānu
vinibiṁchanā mīgu vĕlam̐dulāla
panivaḍi yāmāḍagu parāgulu sesīni
yĕnasi yiṭṭivānido nemanam̐gam̐galane
(||mīrai||)
anniḍām̐ dāmu jūjālāḍugŏnam̐gā mīgu
sannalam̐ jūbuḍaledā sagiyalāla
sinniyalamelmaṁganu śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
yĕnnam̐ga nannū nelĕ nemanam̐gam̐galane