Meeraide neṟamgaru meeloni vedugalu

మీరైతే నెఱఁగరు మీలోని వేడుకలు
Language

(॥పల్లవి॥)
మీరైతే నెఱఁగరు మీలోని వేడుకలు
ఆ రీతి సన్నలు చేసే రతివ లిందరును

(॥మీరై॥)
చిమ్ముఁజూపులతోడుత సేస మీరు వెట్టుకోఁగా
మిమ్ముఁజూచి చెలులెల్లా మెచ్చి నవ్వేరు
వుమ్మడిఁ గొంగులు ముళ్ళు వొకరొకరు వేయఁగ
సొమ్మల మొకమొకాలు చూచేరిందరును

(॥మీరై॥)
కడుఁ దమకముతోడ కంకణాలు గట్టుకోఁగాఁ
నడరి ఆడుకొనేరు అంగనలెల్ల
తొడిఁబడ నిద్దరును తోడనీళ్ళాఁడఁ గాను
గుడిగొని లోలో సిగ్గులు వడేరిందరు

(॥మీరై॥)
పేరటాండ్లకు మీరు పేరులిద్దరుఁ జెప్పఁగా
నారసి నవ్వేరు సతు లాడనీడను
చేరెలమేలుమంగను శ్రీవేంకటేశ కూడి
గారవించి పొగడుతాఁ గదిసే రిందరును

(||pallavi||)
mīraide nĕṟam̐garu mīloni veḍugalu
ā rīdi sannalu sese radiva liṁdarunu

(||mīrai||)
simmum̐jūbuladoḍuda sesa mīru vĕṭṭugom̐gā
mimmum̐jūsi sĕlulĕllā mĕchchi navveru
vummaḍim̐ gŏṁgulu muḽḽu vŏgarŏgaru veyam̐ga
sŏmmala mŏgamŏgālu sūseriṁdarunu

(||mīrai||)
kaḍum̐ damagamudoḍa kaṁkaṇālu gaṭṭugom̐gām̐
naḍari āḍugŏneru aṁganalĕlla
tŏḍim̐baḍa niddarunu toḍanīḽḽām̐ḍam̐ gānu
guḍigŏni lolo siggulu vaḍeriṁdaru

(||mīrai||)
peraḍāṁḍlagu mīru peruliddarum̐ jĕppam̐gā
nārasi navveru sadu lāḍanīḍanu
serĕlamelumaṁganu śhrīveṁkaḍeśha kūḍi
gāraviṁchi pŏgaḍudām̐ gadise riṁdarunu