మీఁటితే నవిసీ నవె మిక్కిలి మీ పాయములు
(॥పల్లవి॥)
మీఁటితే నవిసీ నవె మిక్కిలి మీ పాయములు
వాఁటమై నవ్వఁగదవే వాసులేఁటికి
(॥మీఁటి॥)
మొగము చూచిన మీఁద మోనము లేమిటికే
తగినమాటాడవే ఆతని తోడను
వొగరాయ నలుకలు వొడినిఁ(ని?) డె వలపులు
చిగురు మోవియ్యఁగదే సిగ్గులేఁటికి
(॥మీఁటి॥)
తనువులు సోఁకె నిఁక తలవంపు లేఁటికే
మనసియ్యఁగదవే రమణునికిని
కొనసాగెఁ దమకము గురులేసె మదనుఁడు
చెనకి కాఁగిలించవే చింతలేఁటికి
(॥మీఁటి॥)
ఆయములు గరఁగెను అనుమానాలేఁటికే
చేయిచాఁచి కూడవే శ్రీ వేంకటేశు
రేయాయఁ బగలెల్ల రిచ్చలాయ మీరతుల
చాయకు వచ్చితి విఁక సటలేఁటికే
(||pallavi||)
mīm̐ṭide navisī navĕ mikkili mī pāyamulu
vām̐ṭamai navvam̐gadave vāsulem̐ṭigi
(||mīm̐ṭi||)
mŏgamu sūsina mīm̐da monamu lemiḍige
taginamāḍāḍave ādani toḍanu
vŏgarāya nalugalu vŏḍinim̐(ni?) ḍĕ valabulu
siguru moviyyam̐gade siggulem̐ṭigi
(||mīm̐ṭi||)
tanuvulu som̐kĕ nim̐ka talavaṁpu lem̐ṭige
manasiyyam̐gadave ramaṇunigini
kŏnasāgĕm̐ damagamu gurulesĕ madanum̐ḍu
sĕnagi kām̐giliṁchave siṁtalem̐ṭigi
(||mīm̐ṭi||)
āyamulu garam̐gĕnu anumānālem̐ṭige
seyisām̐si kūḍave śhrī veṁkaḍeśhu
reyāyam̐ bagalĕlla richchalāya mīradula
sāyagu vachchidi vim̐ka saḍalem̐ṭige