మీఁదమీఁద వలపెక్కె మేలుమేలోయి
(॥పల్లవి॥)
మీఁదమీఁద వలపెక్కె మేలుమేలోయి
చీఁదర రేఁచేవు నన్ను చెల్లులేవోయి
(॥మీఁద॥)
నిద్దురో నివ్వెరగో నేనేమో చెప్పఁగాను
వొద్దనుండే వూఁకొనవు వోయి మేలోయి
పెద్దరికమో బీరమో బెట్టివీడె మడిగితే
కద్డనవు లేదనవు గర్వమేలోయి
(॥మీఁద॥)
కాఁకలో నీఁకలో కడు నేను నవ్వినను
మాఁకువలె నున్నాఁడవు మతక మౌనోఇ
వేఁకమో వెరపో వేగ నేఁ జేయివేసితే
కేఁకరించి ములిగేవు గేలి యేలోయి
(॥మీఁద॥)
ఆసలో వాసులో అండ నేను నిలుచుంటే
మేసులఁగాఁగిలించేవు మె స్తిలేవోయి
బాసతో శ్రీ వేంకటేశ పంతాన నన్నుఁ గూడితి
వేసములెల్లాఁదీరె వింతలాయనోయి
(||pallavi||)
mīm̐damīm̐da valabĕkkĕ melumeloyi
sīm̐dara rem̐sevu nannu sĕllulevoyi
(||mīm̐da||)
nidduro nivvĕrago nenemo sĕppam̐gānu
vŏddanuṁḍe vūm̐kŏnavu voyi meloyi
pĕddarigamo bīramo bĕṭṭivīḍĕ maḍigide
kadḍanavu ledanavu garvameloyi
(||mīm̐da||)
kām̐kalo nīm̐kalo kaḍu nenu navvinanu
mām̐kuvalĕ nunnām̐ḍavu madaga maunoi
vem̐kamo vĕrabo vega nem̐ jeyiveside
kem̐kariṁchi muligevu geli yeloyi
(||mīm̐da||)
āsalo vāsulo aṁḍa nenu nilusuṁṭe
mesulam̐gām̐giliṁchevu mĕ stilevoyi
bāsado śhrī veṁkaḍeśha paṁtāna nannum̐ gūḍidi
vesamulĕllām̐dīrĕ viṁtalāyanoyi