మీఁద మిక్కిలి సన్నలు మీరే యెఱుఁగుదురు
(॥పల్లవి॥)
మీఁద మిక్కిలి సన్నలు మీరే యెఱుఁగుదురు
యీఁదా మోఁదా(?) మొక్కు మొఁక్కేమిదివో నేము
(॥మీఁద॥)
తటుకున నందరితో తచ్చనలాడేటి నీఁ
నటనలు చూచే నవ్వీ నాపె
కుటిలము నెరఁగము గుంపించ నెఱఁగము
యిటువలె సేవ సేసే మిదివో నేము
(॥మీఁద॥)
వనితలతో నెల్లా వంతులు జరుపే నీ-
ననుపులు చూచే నవ్వీ నాపె
పెనఁగఁగ నెరఁగము బిగియఁగ నెరఁగము
యెనసి కొలువు సేసే మిదివో నేము
(॥మీఁద॥)
అలరి శ్రీవేంకటేశ అందరిఁ గాఁగిటఁ గూడే
నాలితనములు చూచే నవ్వీ నాపె
జాలిఁబెట్టి నెరఁగము సాదించ నెరఁగము
యీలాగులఁ గలసే మిదివో నేము
(||pallavi||)
mīm̐da mikkili sannalu mīre yĕṟum̐guduru
yīm̐dā mom̐dā(?) mŏkku mŏm̐kkemidivo nemu
(||mīm̐da||)
taḍuguna naṁdarido tachchanalāḍeḍi nīm̐
naḍanalu sūse navvī nābĕ
kuḍilamu nĕram̐gamu guṁpiṁcha nĕṟam̐gamu
yiḍuvalĕ seva sese midivo nemu
(||mīm̐da||)
vanidalado nĕllā vaṁtulu jarube nī-
nanubulu sūse navvī nābĕ
pĕnam̐gam̐ga nĕram̐gamu bigiyam̐ga nĕram̐gamu
yĕnasi kŏluvu sese midivo nemu
(||mīm̐da||)
alari śhrīveṁkaḍeśha aṁdarim̐ gām̐giḍam̐ gūḍe
nālidanamulu sūse navvī nābĕ
jālim̐bĕṭṭi nĕram̐gamu sādiṁcha nĕram̐gamu
yīlāgulam̐ galase midivo nemu