Meemda mikkili panulu mee sittamu

మీఁద మిక్కిలి పనులు మీ చిత్తము
Language

(॥పల్లవి॥)
మీఁద మిక్కిలి పనులు మీ చిత్తము
యీఁదితిని మోహజలధిప్పుడే నేనయ్యా

(॥మీఁద॥)
కన్నులఁ జూచినంతనే కరఁగితిని । యిఁక
నిన్ను నేము సోదించనేరమయ్య
యెన్నిలేవు నాయాస లెంచబోతేను । నీవు
మన్నించినకొలదీ మాకుఁ జాలునయ్యా

(॥మీఁద॥)
నవ్వులు నవ్వినంతనే ననిచతిని । ఇఁక -
నవ్వలిపనులు నిన్ను నడుగనయ్య
యెవ్వ రేమిబుద్ది చెప్పే రిటమీఁదను । నీవు
అవ్వలివ్వలినుం డెప్పుడైనా రావయ్యా

(॥మీఁద॥)
ఇంటికి వచ్చినంతనే యెనసితిని
వొంటి నిన్నుఁబాసి వుండనోపనయ్యా
నంటున శ్రీవేంకటేశ నన్నుఁగూడితి । నీ
వంటి నన్ను జెక్కు నొక్కి తది చాలునయ్యా

(||pallavi||)
mīm̐da mikkili panulu mī sittamu
yīm̐didini mohajaladhippuḍe nenayyā

(||mīm̐da||)
kannulam̐ jūsinaṁtane karam̐gidini | yim̐ka
ninnu nemu sodiṁchaneramayya
yĕnnilevu nāyāsa lĕṁchabodenu | nīvu
manniṁchinagŏladī māgum̐ jālunayyā

(||mīm̐da||)
navvulu navvinaṁtane nanisadini | im̐ka -
navvalibanulu ninnu naḍuganayya
yĕvva remibuddi sĕppe riḍamīm̐danu | nīvu
avvalivvalinuṁ ḍĕppuḍainā rāvayyā

(||mīm̐da||)
iṁṭigi vachchinaṁtane yĕnasidini
vŏṁṭi ninnum̐bāsi vuṁḍanobanayyā
naṁṭuna śhrīveṁkaḍeśha nannum̐gūḍidi | nī
vaṁṭi nannu jĕkku nŏkki tadi sālunayyā