మీకుఁ గొత్తలింతే కాక మించిన వీని సుద్దులు
(॥పల్లవి॥)
మీకుఁ గొత్తలింతే కాక మించిన వీని సుద్దులు
చౌకలైనమీఁద వీని చనవులు గలవా
(॥మీకు॥)
పాటించి నవ్వులలోనే పగలు చాటఁగనిఁకఁ
నేఁటి మంచితనమే తానెవ్వఁడే వీఁడు
కూటమినూరకే మీరు కొనఁబెట్టేరింతె కాక
నాటకీఁడు వీనిమాట నమ్మనెట్టు వచ్చునే
(॥మీకు॥)
తోడనే కూచుండి వట్టిదూరులు దూరీ నన్ను-
నేడ చుట్టిరికమే తానెవ్వఁడే వీఁడు
జాడలవలపు మీరే చవులు సేసేరుగాక
కోడెకాఁడు వీఁడు చేసేకూరుములూఁ గలవా
(॥మీకు॥)
చెక్కు నన్ను నొక్కుతానే చేఁతలు సేసీఁదాను
యెక్కడిమేలు చల్లీఁ దానెవ్వఁడే వీఁడు
యిక్కువలంటి శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁగూడె
తక్కరీఁడు వీనితోడి తగవులఁ గలవా
(||pallavi||)
mīgum̐ gŏttaliṁte kāga miṁchina vīni suddulu
saugalainamīm̐da vīni sanavulu galavā
(||mīgu||)
pāḍiṁchi navvulalone pagalu sāḍam̐ganim̐kam̐
nem̐ṭi maṁchidaname tānĕvvam̐ḍe vīm̐ḍu
kūḍaminūrage mīru kŏnam̐bĕṭṭeriṁtĕ kāga
nāḍagīm̐ḍu vīnimāḍa nammanĕṭṭu vachchune
(||mīgu||)
toḍane kūsuṁḍi vaṭṭidūrulu dūrī nannu-
neḍa suṭṭirigame tānĕvvam̐ḍe vīm̐ḍu
jāḍalavalabu mīre savulu seserugāga
koḍĕgām̐ḍu vīm̐ḍu sesegūrumulūm̐ galavā
(||mīgu||)
sĕkku nannu nŏkkudāne sem̐talu sesīm̐dānu
yĕkkaḍimelu sallīm̐ dānĕvvam̐ḍe vīm̐ḍu
yikkuvalaṁṭi śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐gūḍĕ
takkarīm̐ḍu vīnidoḍi tagavulam̐ galavā