Meegu meere vogadaide melugaaga

మీకు మీరే వొకటైతే మేలుగాక
Language

(॥పల్లవి॥)
మీకు మీరే వొకటైతే మేలుగాక
యీకడాకడివారెల్లా యెనఇంచఁగలరా

(॥మీకు॥)
జగడములెల్లాఁ బాసె సతితో మాటలాడఁగా
నగవులు వొడమెను నంటు సేయఁగా
చిగిరించె వలపులు సిగ్గులు విడువఁగాను
పొగరులచెలులెల్లా బుద్దిచెప్పఁగలరా

(॥మీకు॥)
ఆయములు గరఁగెను అట్టె తప్పక చూడఁగా
చేయిఁజేఇ మీఁదాయ చెనకఁగాను
కాయము లుప్పొంగెను కందువలఁ బెనఁగఁగా
చాయవాటుసతులెల్ల జంటసేయఁగలరా

(॥మీకు॥)
తమకములు రేఁగెను తలఁపు లొక్కటిగాఁగా
జమళికూటము లబ్బె చలపట్టఁగా
అమర శ్రీవేంకటేశ ఆపె నీవూ బోందితిరి
కొమరెవనితలెల్లఁ గొంకు దీర్పఁగలరా

(||pallavi||)
mīgu mīre vŏgaḍaide melugāga
yīgaḍāgaḍivārĕllā yĕna̮iṁcham̐galarā

(||mīgu||)
jagaḍamulĕllām̐ bāsĕ sadido māḍalāḍam̐gā
nagavulu vŏḍamĕnu naṁṭu seyam̐gā
sigiriṁchĕ valabulu siggulu viḍuvam̐gānu
pŏgarulasĕlulĕllā buddisĕppam̐galarā

(||mīgu||)
āyamulu garam̐gĕnu aṭṭĕ tappaga sūḍam̐gā
seyim̐jei mīm̐dāya sĕnagam̐gānu
kāyamu luppŏṁgĕnu kaṁduvalam̐ bĕnam̐gam̐gā
sāyavāḍusadulĕlla jaṁṭaseyam̐galarā

(||mīgu||)
tamagamulu rem̐gĕnu talam̐pu lŏkkaḍigām̐gā
jamaḽigūḍamu labbĕ salabaṭṭam̐gā
amara śhrīveṁkaḍeśha ābĕ nīvū boṁdidiri
kŏmarĕvanidalĕllam̐ gŏṁku dīrbam̐galarā