Meegu meegu buddulella memu seppemaa

మీకు మీకు బుద్దులెల్ల మేము చెప్పేమా
Language

(॥పల్లవి॥)
మీకు మీకు బుద్దులెల్ల మేము చెప్పేమా
సాకిరి మారుబాణాలు చక్కనుండీనా

(॥మీకు॥)
అప్పటి కప్పటిమాట లాడితి రింతె కాక
యిప్పటిమారు మోములు యిఁక నేలా
కప్పుర ముండినచోట కడువాస నేల మాను
యెప్పటికి మాటలాడ కట్టె వుండేరా

(॥మీకు॥)
వగలేక నగి నగి వాడు వచ్చె నింతె కాక
యెగసక్కెములు మీ కిఁక నేఁటికి
చిగిరించి రాఁగా రాఁగా చేఁగ లెక్క కేల మాను
మొగ మొగా లిటు చూచి మొక్కకుండేరా

(॥మీకు॥)
పైపై రతివేళనే పంత మాడితిరి గాక
యేపున వట్టివొట్టులు యిఁక నేఁటికి
చేపట్టి కలసితివి శ్రీవేంకటేశ యింతిని
కోపము దీరినమీఁద కొంకి వుండేరా

(||pallavi||)
mīgu mīgu buddulĕlla memu sĕppemā
sāgiri mārubāṇālu sakkanuṁḍīnā

(||mīgu||)
appaḍi kappaḍimāḍa lāḍidi riṁtĕ kāga
yippaḍimāru momulu yim̐ka nelā
kappura muṁḍinasoḍa kaḍuvāsa nela mānu
yĕppaḍigi māḍalāḍa kaṭṭĕ vuṁḍerā

(||mīgu||)
vagalega nagi nagi vāḍu vachchĕ niṁtĕ kāga
yĕgasakkĕmulu mī kim̐ka nem̐ṭigi
sigiriṁchi rām̐gā rām̐gā sem̐ga lĕkka kela mānu
mŏga mŏgā liḍu sūsi mŏkkaguṁḍerā

(||mīgu||)
paibai radiveḽane paṁta māḍidiri gāga
yebuna vaṭṭivŏṭṭulu yim̐ka nem̐ṭigi
sebaṭṭi kalasidivi śhrīveṁkaḍeśha yiṁtini
kobamu dīrinamīm̐da kŏṁki vuṁḍerā