మీకు మీకే కానవచ్చు మిన్నులపై మెఱుఁగులు
(॥పల్లవి॥)
మీకు మీకే కానవచ్చు మిన్నులపై మెఱుఁగులు
మాకు నెట్టు దెలుసు మీ మనసుల మాయలు
(॥మీకు॥)
యేమిటికే చెలియ నీవితఁడు యెదురెదుర
మోము మోము వంచితిరి ముసిముసిసిగ్గులతో
తామెరకుఁ దామరే ధరఁ జంద్రుఁ డాయనో మీ-
మోముటద్దములలోని మొరఁగులు గంటిరో
(॥మీకు॥)
యేపనికే మగువ మీరిద్దరూను మీలోన
చూపుఁజూపు సరిఁదాఁకె సొలపుల చొక్కితిరి
యేపుఁగలువల కవె యిటు తామెరలాయనో
మేపుమీనములు జఁటై మేఁతలు మఱచెనో
(॥మీకు॥)
యెక్కడివే వనిత మీకిద్దరికెమ్మోవులందు
చుక్కలుఁజుక్కలే సురవొన్నలై పూచె
వొక్కటై శ్రీవేంకటేశుఁ డొద్దికైనలెక్కలో
చక్కనిరతుల మీరు సరిబేశాడితిరో
(||pallavi||)
mīgu mīge kānavachchu minnulabai mĕṟum̐gulu
māgu nĕṭṭu dĕlusu mī manasula māyalu
(||mīgu||)
yemiḍige sĕliya nīvidam̐ḍu yĕdurĕdura
momu momu vaṁchidiri musimusisiggulado
tāmĕragum̐ dāmare dharam̐ jaṁdrum̐ ḍāyano mī-
momuḍaddamulaloni mŏram̐gulu gaṁṭiro
(||mīgu||)
yebanige maguva mīriddarūnu mīlona
sūbum̐jūbu sarim̐dām̐kĕ sŏlabula sŏkkidiri
yebum̐galuvala kavĕ yiḍu tāmĕralāyano
mebumīnamulu jam̐ṭai mem̐talu maṟasĕno
(||mīgu||)
yĕkkaḍive vanida mīgiddarigĕmmovulaṁdu
sukkalum̐jukkale suravŏnnalai pūsĕ
vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ ḍŏddigainalĕkkalo
sakkaniradula mīru saribeśhāḍidiro