మీకిద్దరికే తెలుసు మీలోని మర్మములు
(॥పల్లవి॥)
మీకిద్దరికే తెలుసు మీలోని మర్మములు
పైకొని యెదురెదుర పచ్చిదేరీ సిగ్గులు
(॥మీకి॥)
ముక్కల గదలఁగాను ముసి ముసి నవ్వు నవ్వీ
చెక్కిటఁ జేయివెట్టుక చెలి నీతోను
యిక్కువలు గరఁగ నీ వేమంటివోకాని
పక్కన నడుగరాదు పచ్చిదేరీ సిగ్గులు
(॥మీకి॥)
కంకణాలు గల్లనఁగా కాంత చేసన్నలు సేసీ
కుంకుమ చెమట కొనగోరఁ జిమ్ముతా
వుంకువ మీకెటువంటి వొడఁబాటులోకాని
పంకించక మీలోమీకు పచ్చిదేరీ సిగ్గులు
(॥మీకి॥)
చిత్తము గరఁగఁగాను చేరి కాఁగిలించుకొని
గుత్తపు గుబ్బల నొత్తీ కొసరుకొంటా
పొత్తుల శ్రీవేంకటేశ పొందినరతు లెట్టివో
బత్తితో మీభావములఁ బచ్చిదేరీ సిగ్గులు
(||pallavi||)
mīgiddarige tĕlusu mīloni marmamulu
paigŏni yĕdurĕdura pachchiderī siggulu
(||mīgi||)
mukkala gadalam̐gānu musi musi navvu navvī
sĕkkiḍam̐ jeyivĕṭṭuga sĕli nīdonu
yikkuvalu garam̐ga nī vemaṁṭivogāni
pakkana naḍugarādu pachchiderī siggulu
(||mīgi||)
kaṁkaṇālu gallanam̐gā kāṁta sesannalu sesī
kuṁkuma sĕmaḍa kŏnagoram̐ jimmudā
vuṁkuva mīgĕḍuvaṁṭi vŏḍam̐bāḍulogāni
paṁkiṁchaga mīlomīgu pachchiderī siggulu
(||mīgi||)
sittamu garam̐gam̐gānu seri kām̐giliṁchugŏni
guttabu gubbala nŏttī kŏsarugŏṁṭā
pŏttula śhrīveṁkaḍeśha pŏṁdinaradu lĕṭṭivo
battido mībhāvamulam̐ bachchiderī siggulu