Meege telusunu meemee sannalu

మీకే తెలుసును మీమీ సన్నలు
Language

(॥పల్లవి॥)
మీకే తెలుసును మీమీ సన్నలు
వాకుచ్చి యడుగఁగ వసమా మాకు

(॥మీకే॥)
చీటికి మాటికి సిగ్గులు వడఁగా
నాఁటఁగఁ జెలి నిను నవ్వీని
గాఁటాన రెంటెము గప్పుకొనఁగా
సూటిగా నీదిక్కు చూచీ నదివో

(॥మీకే॥)
సరికి బేసికిని బెడిసి యలయఁగా
విరుల నింతి నిను వేసీని
పరిమళములు నీపైఁ బూసుకొనఁగ
వెరవెంచి ముక్కుపై వేలిడుకొనెను

(॥మీకే॥)
కలసియు మలసియు కాఁగిలడుగఁగా
మెలుపున సతి నిన్ను మెచ్చీని
అలమేల్మంగ నేనని శ్రీవేంకట-
నిలయ కూడితివి నెలకొనెఁ దాను

(||pallavi||)
mīge tĕlusunu mīmī sannalu
vāguchchi yaḍugam̐ga vasamā māgu

(||mīge||)
sīḍigi māḍigi siggulu vaḍam̐gā
nām̐ṭam̐gam̐ jĕli ninu navvīni
gām̐ṭāna rĕṁṭĕmu gappugŏnam̐gā
sūḍigā nīdikku sūsī nadivo

(||mīge||)
sarigi besigini bĕḍisi yalayam̐gā
virula niṁti ninu vesīni
parimaḽamulu nībaim̐ būsugŏnam̐ga
vĕravĕṁchi mukkubai veliḍugŏnĕnu

(||mīge||)
kalasiyu malasiyu kām̐gilaḍugam̐gā
mĕlubuna sadi ninnu mĕchchīni
alamelmaṁga nenani śhrīveṁkaḍa-
nilaya kūḍidivi nĕlagŏnĕm̐ dānu