మీకే చెల్లునయ్య మీలోని సుద్దులు
(॥పల్లవి॥)
మీకే చెల్లునయ్య మీలోని సుద్దులు
వాకుచ్చ మీ చేఁతలు మా వసమా యిఁకను
(॥మీకే॥)
మగువ నీమోము చూచి మాట లేమి నాడక
చిగురుఁగెమ్మోవిమీఁద చిలికీ సిగ్గు
యెగసెక్కే లేకతాన నేమంటివో నీవు
తగవు దేరుచ మాతరమా యిఁకను
(॥మీకే॥)
ఆకు మడిచి నీ కిచ్చి అండ నట్టె కూచుండక
కూకులువత్తులు గాఁగ గుప్పీ నవ్వు
పైకొని యాపెకు తొల్లి బాస లేమి యిచ్చితివో
మీకలఁకలు దేరుచ మేమా యిఁకను
(॥మీకే॥)
చేతు లెత్తి నీకు మొక్కి సేవ లేమిఁ జేయక
ఆతలఁ గాఁకలు నీకే అప్పగించీని
నీకునీవే కూడితివి నెమ్మది శ్రీవేంకటేశ
చేకొనె నలమేల్మంగ చెప్పఁగా మాకిఁకను
(||pallavi||)
mīge sĕllunayya mīloni suddulu
vāguchcha mī sem̐talu mā vasamā yim̐kanu
(||mīge||)
maguva nīmomu sūsi māḍa lemi nāḍaga
sigurum̐gĕmmovimīm̐da siligī siggu
yĕgasĕkke legadāna nemaṁṭivo nīvu
tagavu derusa mādaramā yim̐kanu
(||mīge||)
āgu maḍisi nī kichchi aṁḍa naṭṭĕ kūsuṁḍaga
kūguluvattulu gām̐ga guppī navvu
paigŏni yābĕgu tŏlli bāsa lemi yichchidivo
mīgalam̐kalu derusa memā yim̐kanu
(||mīge||)
sedu lĕtti nīgu mŏkki seva lemim̐ jeyaga
ādalam̐ gām̐kalu nīge appagiṁchīni
nīgunīve kūḍidivi nĕmmadi śhrīveṁkaḍeśha
segŏnĕ nalamelmaṁga sĕppam̐gā māgim̐kanu