మీ మతము పరిభాష మీ వల్లనే పుట్టెఁ గాక
(॥పల్లవి॥)
మీ మతము పరిభాష మీ వల్లనే పుట్టెఁ గాక
యే మునులైనాఁ దొల్లి యెంచిరా యీ మాఁట
(॥మీమ॥)
ముడిగి నాలుగు సూత్రములె మీ వివరణము
కడమ వ్యాససూత్రాలు కల్లలా యేమి
కడు ముఖ్యము మహావాక్యమే చాలుననెను
అడరి వసిష్ఠాదు లాడిరా యీమాఁట
(॥మీమ॥)
తానె బ్రహ్మమనంటె తగ జీవన్ముక్తెనేరు
పూని లోకులెల్లా ముక్తిఁ బొందవలెఁగా
పాని కర్మానుభవాలు బాధితాను వృత్తనేరు
వీనుల సర్వపురాణాలు వింటిమా యీమాఁట
(॥మీమ॥)
పైకొని బ్రహ్మజ్ఞానము భక్తిరూపము గాదని
చేకొని కొచ్చెదరట్టె శ్రీవేంకటేశు
దీకొనుచుఁ జేసేరు దేవపూజాది యజ్ఞాలు
యేకాత్మవాదులాల యితవా యీమాట-
(||pallavi||)
mī madamu paribhāṣha mī vallane puṭṭĕm̐ gāga
ye munulainām̐ dŏlli yĕṁchirā yī mām̐ṭa
(||mīma||)
muḍigi nālugu sūtramulĕ mī vivaraṇamu
kaḍama vyāsasūtrālu kallalā yemi
kaḍu mukhyamu mahāvākyame sālunanĕnu
aḍari vasiṣhṭhādu lāḍirā yīmām̐ṭa
(||mīma||)
tānĕ brahmamanaṁṭĕ taga jīvanmuktĕneru
pūni logulĕllā muktim̐ bŏṁdavalĕm̐gā
pāni karmānubhavālu bādhidānu vṛttaneru
vīnula sarvaburāṇālu viṁṭimā yīmām̐ṭa
(||mīma||)
paigŏni brahmajñānamu bhaktirūbamu gādani
segŏni kŏchchĕdaraṭṭĕ śhrīveṁkaḍeśhu
dīgŏnusum̐ jeseru devabūjādi yajñālu
yegātmavādulāla yidavā yīmāḍa-