మీ కెంత వేడుకలైన మేలే మాకు
(॥పల్లవి॥)
మీ కెంత వేడుకలైన మేలే మాకు
మా కేలయ్య మీలో మీకు మచ్చరాలు రేఁచను
(॥॥)
మనసిచ్చి నీ దేవులు మంచి మాట లాడఁగాను
పని వూని చెలులము పంతమాడేమా
ఘనమై నీచేఁత లాపె కప్పిపెట్టు కుండఁగాను
వినయపు నేము నిన్ను వెల్లివిరి సేసేమా
(॥॥)
యెఱిఁగెఱిఁగి నీ కాపె ఇచ్చకము సేయఁగాను
గుఱియైన చెలులము కోపగించేమా
మఱియు నీ సుద్దు లాపె మరపించి దాఁచఁగాను
తఱి తోడ నే మవి తారుకాణఁ బెట్టేమా
(॥॥)
నీడయై యలమేల్మంగ నిన్నుఁ గౌఁగిలించఁగాను
వూడిగపు చెలులము వొద్దనేమా
యీడు జోడై శ్రీ వేంకటేశ నీ వాకెఁ గూడఁగా
వేడుకై వుండేము గాక వింత సేసేమా
(||pallavi||)
mī kĕṁta veḍugalaina mele māgu
mā kelayya mīlo mīgu machcharālu rem̐sanu
(||||)
manasichchi nī devulu maṁchi māḍa lāḍam̐gānu
pani vūni sĕlulamu paṁtamāḍemā
ghanamai nīsem̐ta lābĕ kappibĕṭṭu kuṁḍam̐gānu
vinayabu nemu ninnu vĕlliviri sesemā
(||||)
yĕṟim̐gĕṟim̐gi nī kābĕ ichchagamu seyam̐gānu
guṟiyaina sĕlulamu kobagiṁchemā
maṟiyu nī suddu lābĕ marabiṁchi dām̐sam̐gānu
taṟi toḍa ne mavi tārugāṇam̐ bĕṭṭemā
(||||)
nīḍayai yalamelmaṁga ninnum̐ gaum̐giliṁcham̐gānu
vūḍigabu sĕlulamu vŏddanemā
yīḍu joḍai śhrī veṁkaḍeśha nī vāgĕm̐ gūḍam̐gā
veḍugai vuṁḍemu gāga viṁta sesemā