మేడిపంటిబోన మింతే మేలు విచ్చిచెప్పఁబోతే
(॥పల్లవి॥)
మేడిపంటిబోన మింతే మేలు విచ్చిచెప్పఁబోతే
పాడియుఁ బంతము చెల్లెఁ బదవే చాలును
(॥మేడి॥)
చిత్తములో నామాఁట చెప్ప నోరాడదుగాక
తత్తరపు తనచేఁత తా నెరఁగఁడా
వొత్తుకోలు సేసి యింకా నోడఁబరచఁగనేల
బత్తి గొట్టానఁ బెట్టేమా పదవే చాలును
(॥మేడి॥)
అందుకే నాకన్నుల నీ రాఁపలేనైతిఁగాక
నింద కొడిగట్ట నంతనేరఁడా తాను
మందమిరియాలు చల్లీ మరి తన్ను మేయని-
బందెలు గట్టవచ్చేనా పదవే చాలును
(॥మేడి॥)
వంతదీరఁగూడఁ బరవశము నాకాయఁ గాక
పంతగాఁడు తన కింత భ్రమయనేలే
యింతితో శ్రీవేంకటేశుఁ డిచ్చినకాఁగిలి. లేదు
బంతియని మొరఁగేనా పదవే చాలును
(||pallavi||)
meḍibaṁṭibona miṁte melu vichchisĕppam̐bode
pāḍiyum̐ baṁtamu sĕllĕm̐ badave sālunu
(||meḍi||)
sittamulo nāmām̐ṭa sĕppa norāḍadugāga
tattarabu tanasem̐ta tā nĕram̐gam̐ḍā
vŏttugolu sesi yiṁkā noḍam̐barasam̐ganela
batti gŏṭṭānam̐ bĕṭṭemā padave sālunu
(||meḍi||)
aṁduge nāgannula nī rām̐palenaidim̐gāga
niṁda kŏḍigaṭṭa naṁtaneram̐ḍā tānu
maṁdamiriyālu sallī mari tannu meyani-
baṁdĕlu gaṭṭavachchenā padave sālunu
(||meḍi||)
vaṁtadīram̐gūḍam̐ baravaśhamu nāgāyam̐ gāga
paṁtagām̐ḍu tana kiṁta bhramayanele
yiṁtido śhrīveṁkaḍeśhum̐ ḍichchinagām̐gili. ledu
baṁtiyani mŏram̐genā padave sālunu