Medalekki ninnumjoosi

మేడలెక్కి నిన్నుఁజూచి
Language

(॥౧॥)
మేడలెక్కి నిన్నుఁజూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వేంకటేశ
యాడ నుంటివిందాకానురా*

(॥౨॥)
పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా- వేంకటేశ
లక్కవలె మద్రలంటెరా

(॥౩॥)
దప్పిగొంటివనినీకుఁ- గప్పురముపారమిచ్చి
ముప్పిరి నీవిరహానను - వేంకటేశ
నిప్పనుచు భ్రమసితిరా

(॥౪॥)
నిండఁబూచిన మావిపై- గండుఁగోవిల గూయఁగా
నిండిన నీయెలుఁగంటాను వేంకటేశ
అండకు నిన్ను రమ్మంటిరా

(॥౫॥)
వుదయచందురుఁ జూచి- అదె నీపంజని సవి
యెదురుకేనే వచ్చితిరా - వేంకటేశ
బెదరి మారుమోమైతిరా

(॥౬॥)
మిన్నక కేళాకూళీలో వున్న తమ్మివిరులు నీ
కన్నులంటా జేరఁబోఁగాను - వేంకటేశ
పన్ని మరునమ్మలాయరా

(॥౭॥)
అనిన తుమ్మెదలు నీ - మేనికాంతిఁ బోలునని
పూనిచేతఁ బట్టఁబోఁగాను వేంకటేశ
సునాస్త్రుని వేగులాయరా

(॥౮॥)
కందువ మైచమరించి గందవొడిచల్లుకొని పొంద
నిన్ను దలఁచితిరా వేంకటేశా
అంద చొక్కుమందులాయరా

(॥౯॥)
బొండుమల్లె పానుపుపై నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములంటిరా - వేంకటేశ
యెండలాయ వెన్నెలలు రా

(॥౧౦॥)
నిద్దిరించి నీవు నాకు - వొద్దునుండఁ గలగంటి
చద్దివేఁడి వలపాయరా- - వేంకటేశ
సుద్దులింకా నేమి సేసేరా

(॥౧౧॥)
మల్లెపూవు కొనదాఁకి ఝల్లనను బులకించి
వుల్లము నీకొప్పించితిరా -వేంకటేశ
కల్లగాదు మమ్ముఁ గావరా

(॥౧౨॥)
జోడుగూడి నీవు నేను- నాడు కొన్న మాటలెల్లా
దోడలేని చిత్తరవులై- వేంకటేశ
యాడా నామతిఁ బాయవురా

(॥౧౩॥)
అద్దము నీడలు చూచి ముద్ద్లుమోవి గంటుండఁగా
కొద్దిలేని కాఁకతోడను - వేంకటేశ
పొద్దువోక తమకింతురా

(॥౧౪॥)
పావురమురెక్కఁ జీటి- నీవొద్దికిఁ గట్టియంపి
దేవరకే మెుక్కుకొందురా - వేంకటేశ
నీవిందు రా వలెనంటాను

(॥౧౫॥)
బంగారు పీఁటపైనుండి- ముంగిటకి నీవురాఁగా
తొంగిచూచి నిలుచుండఁగా - వేంకటేశ
యెంగిలిమోవేలడిగేవు

(॥౧౬॥)
దంతపుఁ బావాలు మెట్టి- పంతాన నేను రాఁగాను
యింతలో బలిమిఁ బట్టేవు - వేంకటేశ
అంత నీకుఁ బ్రియమైతినా

(॥౧౭॥)
పట్టుచీరకొంగు జారి- గుట్టు తో నేనుండఁగాను
వట్టినవ్వులేల నవ్వేవు - వేంకటేశ
దిట్టవు నీ యంతవారమా

(॥౧౮॥)
కొప్పుపట్టి తీసి నీవు -చెప్పరాని సేఁత సేసి
తప్పక నేఁ జూచినంతలో - వేంకటేశ
చిప్పిలేల చెమరించేవు

(॥౧౯॥)
బొమ్మల జంకించి నిన్ను- తమ్మిపూవున వేసితే
కమ్మియేల తిట్టుదిట్టేవు - వేంకటేశ
నిమ్మపంట వేతునటరా

(॥౨౦॥)
నెత్తమాడేనంటా రతి- పొత్తుల పందేలు వేసి
వొత్తి నీవే వోడే వేలరా - వేంకటేశ
కొత్తలైన జాణవౌదువు

(॥౨౧॥)
వున్నతి శ్రీవెంకటేశ మన్నించి కూడితివిదే
నన్నునెంత మెచ్చు మెచ్చేవు - వేంకటేశ
కన్నులపండువలాయరా

(॥౨౨॥)
చిలుకలు మనలోన- కలిసిన యట్టివేళ
పలుకు రతిరహస్యాలు - వేంకటేశ
తలఁచినేఁ దలపూఁతరా

(॥౨౩॥)
నీకు వలచిన వలపు- లాకలెత్తె నామతిని
వాకున నేఁ జెప్పఁ జాలరా - వేంకటేశ
లోకమెల్లా నెరిఁగినదే

(॥౨౪॥)
పాయము నీకొక్కనికే- చాయగా మీఁదెత్తితిని
యీయెడఁ గైవాలకుండను - వేంకటేశ
మాయింటినే పాయకుండరా

(॥౨౫॥)
ముమ్మాటికి నీబాసలే- నమ్మివున్నదాన నేను
కుమ్మరించరా నీకరుణ - వేంకటేశ
చిమ్ముఁజీకటెల్ల బాయను

(||౧||)
meḍalĕkki ninnum̐jūsi - kūḍenane yāsadoḍa
vāḍuderi vussuraṁdurā - veṁkaḍeśha
yāḍa nuṁṭiviṁdāgānurā*

(||౨||)
pikkaḍillu sannulabai - sŏkkabu nīvuṁgaramu
gakkana nenaddugŏṁdurā- veṁkaḍeśha
lakkavalĕ madralaṁṭĕrā

(||౩||)
dappigŏṁṭivaninīgum̐- gappuramubāramichchi
muppiri nīvirahānanu - veṁkaḍeśha
nippanusu bhramasidirā

(||౪||)
niṁḍam̐būsina māvibai- gaṁḍum̐govila gūyam̐gā
niṁḍina nīyĕlum̐gaṁṭānu veṁkaḍeśha
aṁḍagu ninnu rammaṁṭirā

(||౫||)
vudayasaṁdurum̐ jūsi- adĕ nībaṁjani savi
yĕdurugene vachchidirā - veṁkaḍeśha
bĕdari mārumomaidirā

(||౬||)
minnaga keḽāgūḽīlo vunna tammivirulu nī
kannulaṁṭā jeram̐bom̐gānu - veṁkaḍeśha
panni marunammalāyarā

(||౭||)
anina tummĕdalu nī - menigāṁtim̐ bolunani
pūnisedam̐ baṭṭam̐bom̐gānu veṁkaḍeśha
sunāstruni vegulāyarā

(||౮||)
kaṁduva maisamariṁchi gaṁdavŏḍisallugŏni pŏṁda
ninnu dalam̐sidirā veṁkaḍeśhā
aṁda sŏkkumaṁdulāyarā

(||౯||)
bŏṁḍumallĕ pānububai nuṁḍi ninnum̐ bāḍi pāḍi
niṁḍujāgaramulaṁṭirā - veṁkaḍeśha
yĕṁḍalāya vĕnnĕlalu rā

(||౧౦||)
niddiriṁchi nīvu nāgu - vŏddunuṁḍam̐ galagaṁṭi
saddivem̐ḍi valabāyarā- - veṁkaḍeśha
sudduliṁkā nemi seserā

(||౧౧||)
mallĕbūvu kŏnadām̐ki jhallananu bulagiṁchi
vullamu nīgŏppiṁchidirā -veṁkaḍeśha
kallagādu mammum̐ gāvarā

(||౧౨||)
joḍugūḍi nīvu nenu- nāḍu kŏnna māḍalĕllā
doḍaleni sittaravulai- veṁkaḍeśha
yāḍā nāmadim̐ bāyavurā

(||౧౩||)
addamu nīḍalu sūsi muddlumovi gaṁṭuṁḍam̐gā
kŏddileni kām̐kadoḍanu - veṁkaḍeśha
pŏdduvoga tamagiṁturā

(||౧౪||)
pāvuramurĕkkam̐ jīḍi- nīvŏddigim̐ gaṭṭiyaṁpi
devarage mĕుkkugŏṁdurā - veṁkaḍeśha
nīviṁdu rā valĕnaṁṭānu

(||౧౫||)
baṁgāru pīm̐ṭabainuṁḍi- muṁgiḍagi nīvurām̐gā
tŏṁgisūsi nilusuṁḍam̐gā - veṁkaḍeśha
yĕṁgilimovelaḍigevu

(||౧౬||)
daṁtabum̐ bāvālu mĕṭṭi- paṁtāna nenu rām̐gānu
yiṁtalo balimim̐ baṭṭevu - veṁkaḍeśha
aṁta nīgum̐ briyamaidinā

(||౧౭||)
paṭṭusīragŏṁgu jāri- guṭṭu to nenuṁḍam̐gānu
vaṭṭinavvulela navvevu - veṁkaḍeśha
diṭṭavu nī yaṁtavāramā

(||౧౮||)
kŏppubaṭṭi tīsi nīvu -sĕpparāni sem̐ta sesi
tappaga nem̐ jūsinaṁtalo - veṁkaḍeśha
sippilela sĕmariṁchevu

(||౧౯||)
bŏmmala jaṁkiṁchi ninnu- tammibūvuna veside
kammiyela tiṭṭudiṭṭevu - veṁkaḍeśha
nimmabaṁṭa vedunaḍarā

(||౨౦||)
nĕttamāḍenaṁṭā radi- pŏttula paṁdelu vesi
vŏtti nīve voḍe velarā - veṁkaḍeśha
kŏttalaina jāṇavauduvu

(||౨౧||)
vunnadi śhrīvĕṁkaḍeśha manniṁchi kūḍidivide
nannunĕṁta mĕchchu mĕchchevu - veṁkaḍeśha
kannulabaṁḍuvalāyarā

(||౨౨||)
silugalu manalona- kalisina yaṭṭiveḽa
palugu radirahasyālu - veṁkaḍeśha
talam̐sinem̐ dalabūm̐tarā

(||౨౩||)
nīgu valasina valabu- lāgalĕttĕ nāmadini
vāguna nem̐ jĕppam̐ jālarā - veṁkaḍeśha
logamĕllā nĕrim̐ginade

(||౨౪||)
pāyamu nīgŏkkanige- sāyagā mīm̐dĕttidini
yīyĕḍam̐ gaivālaguṁḍanu - veṁkaḍeśha
māyiṁṭine pāyaguṁḍarā

(||౨౫||)
mummāḍigi nībāsale- nammivunnadāna nenu
kummariṁcharā nīgaruṇa - veṁkaḍeśha
simmum̐jīgaḍĕlla bāyanu