Mechchu; mechchagumte maanu; mimchi ne naadagamaana

మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన
Language

(॥పల్లవి॥)
మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన
అచ్చపు నీసూత్రధారి నవధారు దేవ

(॥మెచ్చు॥)
వొక్కఁడ నే జీవుఁడను వోహో హరీ
పెక్కు బహురూపాలే పెంచి యాడితి
తక్కిన యింద్రియములే తగుమేళము
అక్కజపు విద్యవాఁడ నవధారు దేవ

(॥మెచ్చు॥)
సూటి నించుకంతవాఁడఁ జూడవే హరీ
వీటి సంసారపుబారి విద్య లాడితి
పాటి నాకర్మమే క్రియాభాషాంగము
ఆటవాఁడ నింతే నేను అవధారు దేవ

(॥మెచ్చు॥)
చేరి చిత్తగించుమీ శ్రీవేంకటేశ నేఁడు
మేరతో భక్తెనే మోకుమీఁద నాడేను
యీరానిపదవులు యిచ్చితి నాకు
ఆరితేరి గెలిచితి నవధారు దేవ

(||pallavi||)
mĕchchu; mĕchchaguṁṭe mānu; miṁchi ne nāḍagamāna
achchabu nīsūtradhāri navadhāru deva

(||mĕchchu||)
vŏkkam̐ḍa ne jīvum̐ḍanu voho harī
pĕkku bahurūbāle pĕṁchi yāḍidi
takkina yiṁdriyamule tagumeḽamu
akkajabu vidyavām̐ḍa navadhāru deva

(||mĕchchu||)
sūḍi niṁchugaṁtavām̐ḍam̐ jūḍave harī
vīḍi saṁsārabubāri vidya lāḍidi
pāḍi nāgarmame kriyābhāṣhāṁgamu
āḍavām̐ḍa niṁte nenu avadhāru deva

(||mĕchchu||)
seri sittagiṁchumī śhrīveṁkaḍeśha nem̐ḍu
merado bhaktĕne mogumīm̐da nāḍenu
yīrānibadavulu yichchidi nāgu
ārideri gĕlisidi navadhāru deva