మెచ్చితిమి తొలుతే నీ మేకులెల్లాను నీ
(॥పల్లవి॥)
మెచ్చితిమి తొలుతే నీ మేకులెల్లాను నీ-
యిచ్చకమే చాలదా యింపులు వుట్టించను
(॥॥)
తీపులు పుట్టించ నీతియ్యనిమోవె చాలదా
మాపురేపుఁ జెలులకు మంతనానను
కోపున నాటలు చూప కొనచూపులే కావా
యేపొద్దు నాసలు చూపి యెలయించను
(॥॥)
గొరబై వలపించ నీ కొనగోరే చాలదా
సరికిబేసికిని జవరాండ్లకు
సిరుల సేసలు చల్ల చిరునవ్వులే కావా
తెరలోనిరతులను తీగెలువారించను
(॥॥)
కడువేడుకలు రేఁచ కాఁగిలిదే చాలదా
అడరిన మావంటి అతివలకు
బడినె శ్రీ వేంకటేశ పలునీసుద్దులే కావా
వుడివోనిరతులను వోలలాడించఁ గను
(||pallavi||)
mĕchchidimi tŏlude nī megulĕllānu nī-
yichchagame sāladā yiṁpulu vuṭṭiṁchanu
(||||)
tībulu puṭṭiṁcha nīdiyyanimovĕ sāladā
māburebum̐ jĕlulagu maṁtanānanu
kobuna nāḍalu sūba kŏnasūbule kāvā
yebŏddu nāsalu sūbi yĕlayiṁchanu
(||||)
gŏrabai valabiṁcha nī kŏnagore sāladā
sarigibesigini javarāṁḍlagu
sirula sesalu salla sirunavvule kāvā
tĕraloniradulanu tīgĕluvāriṁchanu
(||||)
kaḍuveḍugalu rem̐sa kām̐gilide sāladā
aḍarina māvaṁṭi adivalagu
baḍinĕ śhrī veṁkaḍeśha palunīsuddule kāvā
vuḍivoniradulanu volalāḍiṁcham̐ ganu