మెచ్చితిమి తమ కిఁక మేలుగానీవే
(॥పల్లవి॥)
మెచ్చితిమి తమ కిఁక మేలుగానీవే
వచ్చినాఁడు రమణుఁడు వనిత వద్దికిని
(॥మెచ్చి॥)
జక్కవపులుగులకు చందురు వెన్నెలకు
మిక్కిలి చిలుకలకు మేలుగానీవే
అక్కరఁబొందు సేసిన యాలికిని మగనికి
యిక్కువలఁదమి రేఁచీ నిదేపని యటరే
(॥మెచ్చి॥)
పంచబాణములకును పాటలకోవెలలకు
మించుల మేఘములకు మేలుగానినే
యెంచరానిదంపతుల నేడనున్నాఁబట్టి తెచ్చి
పొంచి కాఁగిట నాఁగెడు పొద్దులు వోవటరే
(॥మెచ్చి॥)
మదనునికి శశకి మరి వంతునికిని
మెదలే చల్లగాలికి మేలుగానీవే
యిదె శ్రీవేంకటేశ్వరుఁ డెనలేనిమగుమను
యెదుటఁ దమపంతము లీడేరించుకోనీరే
(||pallavi||)
mĕchchidimi tama kim̐ka melugānīve
vachchinām̐ḍu ramaṇum̐ḍu vanida vaddigini
(||mĕchchi||)
jakkavabulugulagu saṁduru vĕnnĕlagu
mikkili silugalagu melugānīve
akkaram̐bŏṁdu sesina yāligini maganigi
yikkuvalam̐dami rem̐sī nidebani yaḍare
(||mĕchchi||)
paṁchabāṇamulagunu pāḍalagovĕlalagu
miṁchula meghamulagu melugānine
yĕṁcharānidaṁpadula neḍanunnām̐baṭṭi tĕchchi
pŏṁchi kām̐giḍa nām̐gĕḍu pŏddulu vovaḍare
(||mĕchchi||)
madanunigi śhaśhagi mari vaṁtunigini
mĕdale sallagāligi melugānīve
yidĕ śhrīveṁkaḍeśhvarum̐ ḍĕnalenimagumanu
yĕduḍam̐ damabaṁtamu līḍeriṁchugonīre