Mechchidimi ninnunu meluvaamda vauduvu

మెచ్చితిమి నిన్నును మేలువాఁడ వౌదువు
Language

(॥పల్లవి॥)
మెచ్చితిమి నిన్నును మేలువాఁడ వౌదువు
నిచ్చలు మాకన్నిటాను నీవే గుఱిగాక

(॥మెచ్చి॥)
చేసుకొన్న మగఁగవు చేకొనక మానేవా
వాసితోడ రక్షించేదే వైపు గాక
ఆసకొలిసినవాఁడవట్టే రాక మానేవా
బాస దప్పకుండేదే పంతము గాక

(॥మెచ్చి॥)
ప్రియమైన విభుఁడవు బెరయక మానేవా
క్రియతో మన్నించుటే కీరితి గాక
నియతమైనవాఁడవు నెట్టుకొనక మానేవా
జయముగా నేలుటే సంగతి గాక

(॥మెచ్చి॥)
శ్రీ వేంకటేశుఁడవు చేరి కూడక మానేవా
కైవసమై వుండినదే ఘనత గాక
యీవల నన్నేలితివి ఇచ్చగించక మానేవా
యేవల్లాఁ జన విచ్చుటే యెక్కుడు గాక

(||pallavi||)
mĕchchidimi ninnunu meluvām̐ḍa vauduvu
nichchalu māganniḍānu nīve guṟigāga

(||mĕchchi||)
sesugŏnna magam̐gavu segŏnaga mānevā
vāsidoḍa rakṣhiṁchede vaibu gāga
āsagŏlisinavām̐ḍavaṭṭe rāga mānevā
bāsa dappaguṁḍede paṁtamu gāga

(||mĕchchi||)
priyamaina vibhum̐ḍavu bĕrayaga mānevā
kriyado manniṁchuḍe kīridi gāga
niyadamainavām̐ḍavu nĕṭṭugŏnaga mānevā
jayamugā neluḍe saṁgadi gāga

(||mĕchchi||)
śhrī veṁkaḍeśhum̐ḍavu seri kūḍaga mānevā
kaivasamai vuṁḍinade ghanada gāga
yīvala nannelidivi ichchagiṁchaga mānevā
yevallām̐ jana vichchuḍe yĕkkuḍu gāga