Mechchidi ninnidaanu meluraa neevu

మెచ్చితి నిన్నిటాను మేలురా నీవు
Language

(॥పల్లవి॥)
మెచ్చితి నిన్నిటాను మేలురా నీవు
రచ్చ కెక్కె వలపులు రారా నీవు

(॥మెచ్చి॥)
చిప్పిల నీదేహమెల్లాఁ జెమరించఁగఁ జేసితి
నప్పటి నాడేవు బీరా లౌరా నీవు
వుప్పతిల్లఁ జొక్కించి వూదితి నీమేన గోరు
యిప్పు డేమో తాఁకెననే వేరా నీవు

(॥మెచ్చి॥)
యింత రాజసపు నిన్ను యింటికి రప్పించితి
వంతులు వాసులు నెంచేవు వద్దురా నీవు
చింతమోము కళదేర సెలవుల నవ్వించితి
మంతనాలు మఱఁగులు మానరా నీవు

(॥మెచ్చి॥)
యిట్టె కాఁగిట గూడి యిన్నిటాను మెప్పించితి
పట్టినచలము చెల్లెఁ బదరా నీవు
వొట్టుగా శ్రీవేంకటేశ వొక్కటయితి మిద్దరము
మెట్టుకొన్నదొర వవుదు మేలురా నీవు

(||pallavi||)
mĕchchidi ninniḍānu melurā nīvu
rachcha kĕkkĕ valabulu rārā nīvu

(||mĕchchi||)
sippila nīdehamĕllām̐ jĕmariṁcham̐gam̐ jesidi
nappaḍi nāḍevu bīrā laurā nīvu
vuppadillam̐ jŏkkiṁchi vūdidi nīmena goru
yippu ḍemo tām̐kĕnane verā nīvu

(||mĕchchi||)
yiṁta rājasabu ninnu yiṁṭigi rappiṁchidi
vaṁtulu vāsulu nĕṁchevu vaddurā nīvu
siṁtamomu kaḽadera sĕlavula navviṁchidi
maṁtanālu maṟam̐gulu mānarā nīvu

(||mĕchchi||)
yiṭṭĕ kām̐giḍa gūḍi yinniḍānu mĕppiṁchidi
paṭṭinasalamu sĕllĕm̐ badarā nīvu
vŏṭṭugā śhrīveṁkaḍeśha vŏkkaḍayidi middaramu
mĕṭṭugŏnnadŏra vavudu melurā nīvu