Mechchidi ninnappadi melu melu

మెచ్చితి నిన్నప్పటి మేలు మేలు
Language

(॥పల్లవి॥)
మెచ్చితి నిన్నప్పటి మేలు మేలు
ముచ్చటాడి రావయ్య మొఱఁగులు వనితి

(॥మెచ్చి॥)
తక్కించనేరుతువు తరిదప్పకుండా నట్టే
వొక్కటిసేయానేర్తువు వొక్కొక్కరినే
చెక్కులేల నొక్కేవు చిఱునవ్వేల నవ్వేవు
మొక్కే నూరకుండవయ్య మోహానఁ దనిసితి

(॥మెచ్చి॥)
ఆడకూఁ గలవు నీవు యీడకునుఁ గలవు
తోడతోడ వలపులు తొరలించితి
వేడుకకాఁడ వౌదువు వేసాలేల సేసేవు
కూడే నోరుచుకోవయ్య కొంకెల్లఁ దేరితిని

(॥మెచ్చి॥)
తమకించా నీకే చెల్లు దయసేయా నీకే చెల్లు
అమరించితి విద్దరి నట్టె కాఁగిట
చెమరించఁ గూడితివి శ్రీ వేంకటేశ నన్ను
గుమిత మేల సేసేవు కోవయ్య వీడెము

(||pallavi||)
mĕchchidi ninnappaḍi melu melu
muchchaḍāḍi rāvayya mŏṟam̐gulu vanidi

(||mĕchchi||)
takkiṁchaneruduvu taridappaguṁḍā naṭṭe
vŏkkaḍiseyānerduvu vŏkkŏkkarine
sĕkkulela nŏkkevu siṟunavvela navvevu
mŏkke nūraguṁḍavayya mohānam̐ danisidi

(||mĕchchi||)
āḍagūm̐ galavu nīvu yīḍagunum̐ galavu
toḍadoḍa valabulu tŏraliṁchidi
veḍugagām̐ḍa vauduvu vesālela sesevu
kūḍe norusugovayya kŏṁkĕllam̐ deridini

(||mĕchchi||)
tamagiṁchā nīge sĕllu dayaseyā nīge sĕllu
amariṁchidi viddari naṭṭĕ kām̐giḍa
sĕmariṁcham̐ gūḍidivi śhrī veṁkaḍeśha nannu
gumida mela sesevu kovayya vīḍĕmu