Mechchidi nene neevu memtivauduvu

మెచ్చితి నేనే నీవు మేఁటివౌదువు
Language

(॥పల్లవి॥)
మెచ్చితి నేనే నీవు మేఁటివౌదువు
పచ్చి దేరచకువయ్య బండారాన నుండనీ

(॥మెచ్చి॥)
వలపేల చల్లేవే వనిత
తలపోఁత లివి వంతపునీరయా
మలసేవు నీ వెంతమాఁటకారివే
పొలము పలుకుఁదేనె పోఁకకుఁ బుట్టెఁడయా

(॥మెచ్చి॥)
నవ్వులేల నవ్వేవే నలినాక్షి
పువ్వులు తతివచ్చితేఁ బువ్వకుండునా
నివ్వటిల గబ్బివై నెగడితివే
కువ్వఁబోతే జవ్వనము గుదిగొనీనయా

(॥మెచ్చి॥)
ముట్టేవేమే కొనగోర ముదితా
చెట్టడువ సరసము చేటఁ డేసయా
చుట్టమవైతివిగదే సులభానను
యిట్టె శ్రీవేంకటేశ యెనసితి

(||pallavi||)
mĕchchidi nene nīvu mem̐ṭivauduvu
pachchi derasaguvayya baṁḍārāna nuṁḍanī

(||mĕchchi||)
valabela salleve vanida
talabom̐ta livi vaṁtabunīrayā
malasevu nī vĕṁtamām̐ṭagārive
pŏlamu palugum̐denĕ pom̐kagum̐ buṭṭĕm̐ḍayā

(||mĕchchi||)
navvulela navveve nalinākṣhi
puvvulu tadivachchidem̐ buvvaguṁḍunā
nivvaḍila gabbivai nĕgaḍidive
kuvvam̐bode javvanamu gudigŏnīnayā

(||mĕchchi||)
muṭṭeveme kŏnagora mudidā
sĕṭṭaḍuva sarasamu seḍam̐ ḍesayā
suṭṭamavaidivigade sulabhānanu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi