మెచ్చితి నీ సుద్దులు మేలువాఁడవౌదువు
(॥పల్లవి॥)
మెచ్చితి నీ సుద్దులు మేలువాఁడవౌదువు
యిచ్చకములాడేను యింటికి రావయ్యా
(॥॥)
నయగారిమాటలెల్ల నాతో నీవాడితివి
ప్రియములెల్లాఁ జేకొంటిఁ బెనఁగినైతి
క్రియ గూడె నిన్నిటాను కిందిమీఁది పనులెల్ల
జయమాయ మాయింటికి సరుగ రావయ్యా
(॥॥)
నమ్మికలెల్లాఁ జేసి నన్నిట్టే మన్నించితివి
సమ్మతించితిని నిన్ను జరయ నైతి
యెమ్మెలెల్ల దక్కె నేఁడు యేవంక చూచినాను
నెమ్మది మా యింటికి నిక్కెము రావయ్యా
(॥॥)
కరుణతో బుజ్జగించి కాఁగిలించి కూడితివి
యిరవైతి నేమిటాను యెడయనైతి
దొరతనము లీడేరె తోడనే శ్రీవేంకటేశ
సిరులాయ మాయింటికి చెలఁగి రావయ్యా
(||pallavi||)
mĕchchidi nī suddulu meluvām̐ḍavauduvu
yichchagamulāḍenu yiṁṭigi rāvayyā
(||||)
nayagārimāḍalĕlla nādo nīvāḍidivi
priyamulĕllām̐ jegŏṁṭim̐ bĕnam̐ginaidi
kriya gūḍĕ ninniḍānu kiṁdimīm̐di panulĕlla
jayamāya māyiṁṭigi saruga rāvayyā
(||||)
nammigalĕllām̐ jesi nanniṭṭe manniṁchidivi
sammadiṁchidini ninnu jaraya naidi
yĕmmĕlĕlla dakkĕ nem̐ḍu yevaṁka sūsinānu
nĕmmadi mā yiṁṭigi nikkĕmu rāvayyā
(||||)
karuṇado bujjagiṁchi kām̐giliṁchi kūḍidivi
yiravaidi nemiḍānu yĕḍayanaidi
dŏradanamu līḍerĕ toḍane śhrīveṁkaḍeśha
sirulāya māyiṁṭigi sĕlam̐gi rāvayyā